Bandla Ganesh Pawan Kalyan: బండ్ల గణేష్.. నటుడిగా, నిర్మాతగా అందరికీ చిరపరిచతమే.. కానీ అంతకుమించిన పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా కొనసాగుతున్నారు. ఇండస్ట్రీలో పవన్ పై ఈగ వాలనీయకుండా కాపుకాసే వ్యక్తుల్లో బండ్ల గణేష్ ఒకరు. పవన్ ను దేవుడితో కొలుస్తానంటాడు. ఆయన ఫొటో ఇంట్లో పెట్టుకుంటానంటాడు. అంతలా ప్రేమించే బండ్ల గణేష్ తాజాగా పవన్ కళ్యాణ్ పై హాట్ కామెంట్స్ చేశారు. అదే ఇప్పుడు వైరల్ అవుతోంది.

పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ చిత్రం వర్క్ షాప్ నకు తాజాగా పవన్ కళ్యాణ్, కీరవాణి, దర్శకుడు క్రిష్ హాజరయ్యారు. ఇందులో పవన్ కళ్యాణ్ అదిరిపోయే గెటప్ లో దర్శనమిచ్చాడు. ఒక రెడ్ టీషర్ట్ వేసుకొని జీన్స్, షూస్ తో క్లాస్ లుక్ లో అందరి మదిని దోచేశాడు. యంగ్ బాయ్ లా పవన్ కళ్యాణ్ అదిరిపోయే లుక్ చూసి అందరూ ఫిదా అయ్యారు. హరిహర వీరమల్లు సెట్ లోని పవన్ న్యూ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.స్టైలిష్ గా కనిపించిన న్యూ లుక్ ను ఫ్యాన్స్ నెట్టింట్లో తెగ షేర్లు చేస్తూ సందడి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ కొత్త లుక్ చూసిన బండ్ల గణేష్ దాన్ని ట్విట్టర్ లో షేర్ చేశాడు. ‘అబ్బబ్బ మా బాస్ ను చూస్తుంటేగుండెల్లో దడ దడ మొదలయ్యింది. రక్తం ఉరకలేస్తుంది.. ఇప్పుడు ఒక్క చాన్స్ వస్తే.? వెయ్యి కోట్లు దాటే మార్కెట్ ఎట్లుంటదో చూపిస్తా.. అబ్బ ముద్దొస్తున్నావ్.. బాస్’ అంటూ పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ చేసి ప్రశంసల వర్షం కురిపించాడు.
అయితే ఒక మగాడివి అయ్యిండి సాటి మగాడు పవన్ కళ్యాణ్ ను పట్టుకొని ‘ముద్దొస్తున్నావ్’ అంటా వేంటి అంటూ బండ్ల గణేష్ ను కొందరు కామెంట్స్ తో సరదాగా ఆటపట్టిస్తున్నారు. నీ ప్రేమ సల్లగుండ ఇలాంటి కామెంట్స్ చేస్తావా? అని ఇంకొందరు సెటైర్ వేస్తున్నారు. పవన్ పై ప్రేమను ఈ రేంజ్ లో వ్యక్తం చేసిన బండ్ల ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో నటిస్తున్నారు. అక్టోబర్ 17 నుంచి ఈ చిత్రం షూటింగ్ రెండో షెడ్యూల్ ప్రారంభం అవుతోంది. దీనికోసం పవన్ డేట్స్ ఇచ్చాడు. ఆ సినిమాలోని కొత్త లుక్ కోసమే పవన్ ఇలా రెడీ అయినట్లు తెలుస్తోంది. చిత్రబృందం విడుదల చేసిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి.