Sreeleela and Nidhi Agarwal: మన టాలీవుడ్ లో దర్శక నిర్మాతలు కొన్ని సెంటిమెంట్స్ ని బలంగా నమ్ముతారు. ఆ సెంటిమెంట్స్ కి తగ్గట్టే నిర్ణయాలు తీసుకుంటారు. ఈ హీరో/ హీరోయిన్ తో సినిమా చేస్తే కచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అని ముందుగా నిర్ణయం తీసుకుంటున్నారు. అలా రీసెంట్ గా ఇద్దరు హీరోయిన్స్ ఉదాహరణగా నిలిచారు. ఆ ఇద్దరు ఎవరంటే శ్రీలీల(Sreeleela), నిధి అగర్వాల్(Nidhi Agarwal). పెళ్లి సందడి చిత్రం తో ఇండస్ట్రీ లోకి మెరుపు లాగా దూసుకొచ్చింది శ్రీలీల. అందం తో పాటు అద్భుతమైన డ్యాన్స్ ఉండడం తో రాబోయే రోజుల్లో ఈ అమ్మాయి సౌత్ ఇండియాని ఏలుతుందని అంతా అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రెండవ సినిమా ‘ధమాకా’ తో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఈ హాట్ బ్యూటీ. కానీ ఆ చిత్రం తర్వాత ఈ హీరోయిన్ పది సినిమాలకు పైగా చేస్తే, అందులో ‘భగవంత్ కేసరి’ చిత్రం ఒక్కటే కమర్షియల్ గా హిట్ అయ్యింది.
మిగిలిన సినిమాలన్నీ ఒక దానిని మించి ఒకటి డిజాస్టర్ ఫ్లాప్ అవుతూ వచ్చాయి. టాలీవుడ్ లో ఆమె గత చిత్రం ‘మాస్ జాతర’ కమర్షియల్ గా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇక తమిళం లో ఆమె హీరోయిన్ గా నటించిన ‘పరాశక్తి’ చిత్రం భారీ అంచనాల నడుమ ఈ సంక్రాంతికి విడుదలై ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఈ సంక్రాంతికి తమిళనాడు లో పెద్దగా పోటీ కూడా లేదు. విడుదల అవ్వాల్సిన తమిళ సూపర్ స్టార్ విజయ్ ‘జన నాయగన్’ చిత్రం వాయిదా పడింది. ఇంత ఫ్రీ స్పేస్ లో కూడా ఈ చిత్రం అంత పెద్ద ఫ్లాప్ అయ్యిందంటే శ్రీలీల లెగ్ మామూలుది కాదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఐరన్ లెగ్ గా పిలవబడే నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి.
ఈమె మన టాలీవుడ్ లోకి అక్కినేని నాగ చైతన్య ‘సవ్యసాచి’ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత అఖిల్ తో ‘మిస్టర్ మజ్ను’ చేసింది. ఇది కూడా ఫ్లాప్ అయ్యింది. అలా ఫ్లాపులను అందుకుంటూ వస్తున్న ఈ హీరోయిన్ కెరీర్ ‘ఇస్మార్ట్ శంకర్’ ఒక్కటే కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. పవన్ కళ్యాణ్ , ప్రభాస్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ సినిమాల్లో అవకాశాలు రావడం ఒక అదృష్టం. అలాంటిది ఈమెకు ఒకేసారి ఆ ఇద్దరి హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశాలు వచ్చాయి. కానీ చివరికి ‘హరి హర వీరమల్లు’, ‘రాజా సాబ్’ సినిమాల ఫలితాలు ఏంటో మీరందరు చూశారు. ఇప్పుడు ఈమె రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించేందుకు సంతకాలు చేసిందట. రాజా సాబ్ ఫలితం చూసిన తర్వాత ఇప్పుడు ఆ రెండు సినిమాల నుండి ఈమెని తప్పించాలని చూస్తున్నారట నిర్మాతలు.
