Prabhas: సెప్టెంబర్ 29న ప్రభాస్ మొగల్తూరు వెళ్ళాడు. గత నెల 11న నటుడు కృష్ణంరాజు అనారోగ్యంతో మరణించారు. గురువారం కృష్ణంరాజు సొంతూరు మొగల్తూరులో సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. 12 ఏళ్ళ తర్వాత ప్రభాస్ సొంత ఊరికి వెళ్లారు. చివరిసారి ఆయన 2010లో మొగల్తూరు వచ్చారు. తండ్రి సూర్యనారాయణ రాజు మరణించగా దిశదిన కర్మ నిర్వహించడం కోసం 2010లో అక్కడకు వెళ్లారు. ఇక ప్రభాస్ రాకను తెలుసుకున్న అభిమానులు మొగల్తూరుకు పోటెత్తారు.

వేలమంది ఫ్యాన్స్ తో ఊరు కిక్కిరిసిపోయింది. ఎక్కడ చూసిన జనాలే. ఆయన్ని చూసేందుకు ఎగబడ్డారు. కార్యక్రమం ఏమిటో కూడా మరచి నినాదాలతో రెచ్చిపోయారు. మొగల్తూరు జన సంద్రంగా మారింది. కాగా అభిమానుల కోసం ప్రభాస్ ఏర్పాటు చేసిన విందు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. 50 రకాల వంటకాలతో కనీ వినీ ఎరుగని రీతిలో భోజనాలు సమకూర్చారు. హైదరాబాద్ నుండి చేయి తిరిగిన వంటగాళ్లను తీసుకెళ్లారు. మటన్, చికెన్, ఫిష్, ఫ్రాన్స్, పీతలు ఒకటేంటి… లెక్కకు మించిన ఐటమ్స్ తో మెనూ సిద్ధం చేశారు.
అభిమానులకు ప్రభాస్ తృప్తిగా భోజనం పెట్టి పంపారు. ఈ కార్యక్రమం కోసం వారం రోజుల ముందే అక్కడికి 50 మందికి పైగా సిబ్బందిని పంపారు. టన్నుల కొద్దీ మాంసం కొనుగోలు చేశారు. కాగా ఈ విందు భోజనాలకు ప్రభాస్ ఖర్చుపెట్టిన మొత్తం తెలిస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే. అక్షరాలా రూ. 3 కోట్ల రూపాయలు కృష్ణంరాజు సంస్మరణ సభకు ఏర్పాటు చేసిన భోజనాలకు ఖర్చు చేశారట. దాదాపు 75 వేల మందికి భోజనాలు ఏర్పాటు చేయగా, అంత మొత్తంలో ఖర్చయిందని తెలుస్తుంది.

ఒక్కరోజు భోజనాలకు కోట్లు ఖర్చు చేశాడంటే మామూలు విషయం కాదు. డార్లింగ్ ప్రభాస్ పెట్టడంలో భోళా శంకరుడని మరోసారి నిరూపించుకున్నాడు. షూటింగ్ సెట్స్ లో కూడా ప్రభాస్ కో స్టార్స్ కి అరుదైన వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేస్తారు. ప్రభాస్ తో పని చేసిన శ్రద్దా కపూర్, శృతి హాసన్,కృతి సనన్ తో పాటు పలువురు హీరోయిన్స్ ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రభాస్ ఆతిధ్యం అదుర్స్ అన్నారు. కాగా ఆదిపురుష్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన ప్రభాస్ ఫ్యాన్స్ కి మరో ట్రీట్ ఇచ్చాడు. అక్టోబర్ 2న ఆదిపురుష్ టీజర్ విడుదల కానుంది.