https://oktelugu.com/

Bandi Sanjay Carrying Amit Shah Shoes: వీడియో : అమిత్ షాకు చెప్పులందించిన బండి సంజయ్..

Bandi Sanjay Carrying Amit Shah Shoes: తెలంగాణ ఉద్యమం పుట్టిందే మన ఆత్మగౌరవం నుంచి.. ఈ ఉద్యమ ఆకాంక్ష బలపడిందే ఆంధ్రుల అహంకారం నుంచి.. మన విద్య, ఉద్యోగ, ఉపాధిని కొందరు ఆంధ్రా నేతలు దూరం చేస్తున్నారని.. సామాజికంగా, రాజకీయంగా వారి దోపిడీని, అణిచివేతకు వ్యతిరేకంగా తెలంగాణ సమాజం ఎదురెళ్లింది. తెలంగాణ ఉద్యమమే కాదు.. నాడు ఢిల్లీ నేతల చేతుల్లో కీలుబొమ్మగా మారిన ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ నేతల చేతకానితనానికి వ్యతిరేకంగా ‘తెలుగువారి ఆత్మ గౌరవాన్ని’ […]

Written By:
  • NARESH
  • , Updated On : August 22, 2022 / 12:19 PM IST
    Follow us on

    Bandi Sanjay Carrying Amit Shah Shoes: తెలంగాణ ఉద్యమం పుట్టిందే మన ఆత్మగౌరవం నుంచి.. ఈ ఉద్యమ ఆకాంక్ష బలపడిందే ఆంధ్రుల అహంకారం నుంచి.. మన విద్య, ఉద్యోగ, ఉపాధిని కొందరు ఆంధ్రా నేతలు దూరం చేస్తున్నారని.. సామాజికంగా, రాజకీయంగా వారి దోపిడీని, అణిచివేతకు వ్యతిరేకంగా తెలంగాణ సమాజం ఎదురెళ్లింది. తెలంగాణ ఉద్యమమే కాదు.. నాడు ఢిల్లీ నేతల చేతుల్లో కీలుబొమ్మగా మారిన ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ నేతల చేతకానితనానికి వ్యతిరేకంగా ‘తెలుగువారి ఆత్మ గౌరవాన్ని’ అన్న ఎన్టీఆర్ లేవనెత్తారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగు వారి ఆత్మాభిమానానికి విలువను పెంచారు.. టోటల్ గా చెప్పొచ్చేది ఏంటంటే.. తెలంగాణ వాసులైనా.. ఏపీ వాసులైనా సరే..‘మన ఆత్మగౌరవానికి భంగం కలిగితే అస్సలు ఒప్పుకోరు. అదే అన్నింటికంటే పవర్ ఫుల్ అస్త్రం.

    ఇప్పుడు తెలంగాణ సమాజానికి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అడ్డంగా దొరికాడు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనలో ఆయన బూట్లు మోసి బుక్కయ్యాడు. ఇప్పుడీ వ్యవహారం తెలంగాణ సమాజంలో ట్రెండింగ్ లో ఉంది. ‘బండి’ బానిస అంటూ ట్విట్టర్ హోరెత్తుతోంది. బీజేపీ మద్దతుదారులకు, ఆ పార్టీలో చేరే వారికి ఈ బానిసల బతుకు అవసరమా? అని అందరూ నిలదీస్తున్న పరిస్థితి నెలకొంది.

    Bandi Sanjay Carrying Amit Shah Shoes

    సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మావారి దర్శనం చేసుకొని గుడి బయటకు అమిత్ షా తిరిగొచ్చే క్రమంలో హడావుడిగా ఆయన వెంట పరిగెత్తుకొచ్చిన బండి సంజయ్.. ఆయన బూట్లు తీసుకొని అందించాడు. బండి సంజయ్ ఇలా స్వామిభక్తిని చూపించడాన్ని ఎవరో వీడియో తీయడంతో అడ్డంగా బుక్కయ్యాడు.

    Amih Shah, Bandi Sanjay

    ఈ వీడియో టీఆర్ఎస్ కు పాశుపతాస్త్రంగా మారింది. అమిత్ షా చెప్పులు మోస్తున్న బండి సంజయ్ వీడియోను షేర్ చేసిన కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశాడు. ‘‘ఢిల్లీ “చెప్పులు” మోసే గుజరాతీ గులాములను- ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకున్ని – తెలంగాణ రాష్ట్రం గమనిస్తున్నది. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పి గొట్టి, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్దంగా ఉన్నది. జై తెలంగాణ!’’ అంటూ కేటీఆర్ కడిగేశాడు.

    ఇప్పుడీ వీడియోను టీఆర్ఎస్ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి. ఆత్మగౌరవం అంటూ టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ లాంటి వారు దీనిపై సమాధానం చెప్పాలని.. ఢిల్లీ నేతల చెప్పులు మోయడం ఆత్మగౌరవమా? అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే దళితులకు కిరీటం పెడుతామని చెబుతున్న అమిత్ షా.. సొంత పార్టీ నేతతో బూట్లు మోయిస్తాడా? అని కౌంటర్లు వేస్తున్నారు. బీజేపీ నేతలు బానిసత్వంతో బతుకుతున్నారని కామెంట్ చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ పరిస్థితి.. అమిత్ షాకు చెప్పులు అందించే దుస్థితి అంటూ ట్రోల్ చేస్తున్నారు. బీజేపీ గెలిస్తే తెలంగాణలోని ప్రజలకు కూడా అదే బానిసత్వం తప్పదని టీఆర్ఎస్ నాయకులు దీన్ని ప్రజల్లోకి తీసుకెళుతున్నారు.

    KCR

    ఆత్మాభిమానం ఉండాలని పదే పదే చెప్పే బీజేపీ నేతలు.. కేసీఆర్ వద్ద నేతలకు ఆత్మాభిమానం లేదంటూ విమర్శించే బండి సంజయ్ లాంటి వారు ఇప్పుడు ఈ వీడియోతో ఎలాంటి సమాధానం చెప్పుకోలేని దుస్థితిలో పడిపోయారు. ఇదేనా మీ ఆత్మాభిమానం అని సోషల్ మీడియాలో ట్యాగ్ చేసి మరీ బండిని ప్రశ్నిస్తున్నారు.

    బండిసంజయ్ చెప్పులు మోయడం టీఆర్ఎస్ కు ఆయాచితంగా వరంగా మారింది. బీజేపీని గెలిపిస్తే ఢిల్లీ వెళ్లి చెప్పులు మోయాల్సిందే అంటూ టీఆర్ఎస్ ట్రోలింగ్ మొదలుపెట్టింది. ఈ వీడియో చూశాక అయినా బీజేపీని ఓడించాలని వైరల్ చేస్తున్నారు. పదవుల కోసం బీజేపీ నేతలు ఇలా చెప్పులు మోస్తారంటూ.. గులాంగిరీ చేస్తారంటూ ట్రోల్స్ సోషల్ మీడియాలో హోరెత్తుతున్నాయి.

    అంతా సవ్యంగా సాగిందని.. అమిత్ షా పర్యటనకు మంచి మైలేజ్ వచ్చిందని అనుకుంటున్న తరుణంలో ఇలా బండిసంజయ్ చెప్పులు మోస్తూ దొరకడం బీజేపీకి మైనస్ గా మారిందనే చెప్పొచ్చు..

    Tags