Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవిత.. తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కరలేని పేరు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కూతురుగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు తర్వాత దేశమంతటికీ సుపరిచితం అయ్యారు. ఇటీవలే బీఆర్‌ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురాయ్యరు. పార్టీలో ఉంటూ సొంత పార్టీ నేతలపైనే అవినీతి ఆరోపణలు, విమర్శలు చేయడంతో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయారు. ఇప్పుడు తెలంగాణ జాగృతి పేరుతో జనం బాట చేస్తున్నారు. కానీ ఇందులో జనం కనిపించడం లేదు. దీంతో కవిత మరో షర్మిల అవుతుంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో కవిత కీలక ప్రకటన చేశారు.
2029 ఎన్నికల బరిలో..
బీఆర్‌ఎస్‌కు వీడ్కోలు చెప్పిన కెసిఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత 2029 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించి ఊహాగానాలకు బలం చేకూర్చింది. ఎక్స్ వేదికగా నిర్వహించిన ‘ఆస్క్ కవిత’ సెషన్‌లో పార్టీ పేరు, లక్ష్యాలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కొత్త రాజకీయ ఉద్యమాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. ‘పార్టీ పేరు ప్రజలు సూచించినట్టుగానే పెడతాం‘ అని కవిత స్పష్టం చేసింది. మహిళలు, యువతకు రాజకీయ అవకాశాలు కల్పించడం ప్రధాన లక్ష్యం. స్కిల్ డెవలప్‌మెంట్, ఉద్యోగ రక్షణలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని హామీ.
కాంగ్రెస్ పాలనపై విమర్శలు..
రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కవిత తీవ్రంగా విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో వైఫల్యంతో లక్షల మంది విద్యార్థులు చదవుకు దూరమవుతున్నారని పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యలు, ఫార్మాసిటీ భూముల్లో ’ఫ్యూచర్ సిటీ’ డ్రామా, సింగరేణి నిర్లక్ష్యం, ఈస్ట్ జోన్ మౌలిక సదుపాయాల లోపాలను ప్రస్తావించారు. జాగృతి సభ్యత్వ కార్యక్రమం త్వరలో ప్రారంభిస్తామని ప్రకటించింది.
రైతుల మద్దతుతో పోరాటం..
ఫార్మాసిటీ రైతులకు మద్దతుగా త్వరలోనే పోరాటం చేస్తానని హెచ్చరించింది. సింగరేణి కార్మికుల సమస్యలపై హెచ్‌ఎంఎస్‌తో కలిసి పోరాడతామని స్పష్టం చేశారు. హైదరాబాద్ వెస్ట్‌కు ప్రాధాన్యత ఇచ్చి ఈస్ట్‌ను విస్మరించారని ఆరోపణ. ఈ విమర్శలు కాంగ్రెస్‌లో కొంపవైన ఆందోళన కలిగించాయి.
అతనే అభిమాన హీరో..
నెటిజన్ల ప్రశ్నలకు సరదాగా అభిమాన హీరో ఎవరు అని అడిగారు. స్పందించిన కవిత మెగాస్టార్ చిరంజీవి అభిమాని అయినప్పటికీ, రామ్ చరణ్ వినయవంతుడు, సూపర్ డాన్సర్ అని ప్రశంసించింది. చిన్నతనంలో ఎర్రమంజిల్‌లో గడిపిన క్షణాలు అత్యంత ఆనందకరమైనవని గుర్తుచేసింది.
కవిత ప్రకటన బీఆర్‌ఎస్‌లో కలవరం రేపింది. 2029 వరకు తెలంగాణ జాగృతి బలపడితే కాంగ్రెస్‌కు సవాల్‌గా మారనుంది. మహిళా–యువత ఫోకస్‌తో కొత్త ఓటు బ్యాంక్ ఏర్పాటవుతుందని విశ్లేషకులు అంచనా.