Mokshagna : మోక్షజ్ఞ మొదటి సినిమా అతనితోనా? పాపం నందమూరి ఫ్యాన్స్ కి కన్నీళ్లు తప్పేలా లేవు

Mokshagna – Puri Jagannath : నందమూరి అభిమానులు ఎంతో కాలం నుండి బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్న సంగతి తెల్సిందే, ప్రతీ ఏడాది ఈసారి పక్కాగా లాంచ్ అవుతాడని అభిమానులు అనుకోవడం, నిరాశ పడడం సర్వ సాధారణం అయిపోయింది.అసలు మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తాడా లేదా అనే సందేహం కూడా కొద్దీ రోజుల క్రితం వరకు ఉండేది,కానీ బాలయ్య మోక్షజ్ఞ ఎంట్రీ కచ్చితంగా ఉంటుందని. అతను నందమూరి […]

Written By: NARESH, Updated On : February 13, 2023 8:54 pm
Follow us on

Mokshagna – Puri Jagannath : నందమూరి అభిమానులు ఎంతో కాలం నుండి బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్న సంగతి తెల్సిందే, ప్రతీ ఏడాది ఈసారి పక్కాగా లాంచ్ అవుతాడని అభిమానులు అనుకోవడం, నిరాశ పడడం సర్వ సాధారణం అయిపోయింది.అసలు మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తాడా లేదా అనే సందేహం కూడా కొద్దీ రోజుల క్రితం వరకు ఉండేది,కానీ బాలయ్య మోక్షజ్ఞ ఎంట్రీ కచ్చితంగా ఉంటుందని. అతను నందమూరి అసలు సిసలు వారసుడు, మా లేజసీని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత వాడి మీద ఉంది అంటూ క్లారిటీ ఇవ్వడం తో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే మోక్షజ్ఞ ఇప్పటికే 30 ఏళ్ళ వయస్సు కి దగ్గర పడుతున్నాడు. చిరంజీవి , నాగార్జున కుమారులు 23 ఏళ్ళ వయస్సు ఉన్నపుడే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు, కానీ 30 ఏళ్ళ వయస్సుకి దగ్గర పడుతున్నా కూడా మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం చెయ్యకపోవడం పై నందమూరి అభిమానులు కాస్త నిరాశకి గురయ్యారు.

మోక్షజ్ఞని ఇంతకాలం సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయకపోవడానికి కారణం అతని జాతకమే అని అంటున్నారు. బాలయ్య జాతకాలను మరియు సంప్రదాయాలను తూచా తప్పకుండా ఫాలో అవుతాడనే విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మోక్షజ్ఞ తేజ జాతకం సినిమాలకు ఏమాత్రం బాగాలేదట, ముందుగా ఎంట్రీ ఇస్తే అపజయాలు ఎక్కువగా పలకరిస్తాయని,  2024 వ సంవత్సరంలో ఎంట్రీ ఇస్తే అతని కెరీర్ లో ఎక్కువ శాతం విజయాలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారట.  అందుకే బాలయ్య ఇన్ని రోజులు మోక్షజ్ఞని ఇండస్ట్రీ కి పరిచయం చేయలేదని తెలుస్తుంది.

ఇది ఇలా ఉండగా.. మోక్షజ్ఞ మొదటి సినిమాకి పూరి జగన్నాథ్ ని డైరెక్టర్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది.పూరి జగన్నాథ్ తో బాలయ్య గతం లో ‘పైసా వసూల్’ అనే సినిమా చేసాడు, అది కమర్షియల్ గా సక్సెస్ కాలేదు, ఆ తర్వాత మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదు కానీ, పూరి జగన్నాథ్ ప్రస్తుతం లైగర్ అనే సినిమాతో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ ని అందుకున్నాడు.ఆ సినిమా చూసిన ప్రతీ ఒక్కరికి అర్థం అయ్యే విషయం ఏమిటంటే పూరి జగన్నాథ్ పని ఇక అయిపోయిందని, అలాంటోడి చేత కొడుకు భవిష్యత్తు ని పెట్టడం తో నందమూరి అభిరామానులు భయపడుతున్నారు.