
Balakrishna: మామూలుగా మనం ఏదైనా పని మీద బయటకు వెళ్తుంటే జరిగేది మంచో చెడో చెప్పేందుకు విధి మనకు కొన్ని సంకేతాలు పంపిస్తుంది. దాన్ని కొందరు మూఢనమ్మకం అంటారు. ఇంకొందరేమో హెచ్చరిక అంటారు. ఉదాహరణకు మగవాళ్లకు ఎడమ కన్ను, ఆడ వాళ్లకు కుడి కన్ను అదరడం ఏదో అశుభానికి సంకేతం అంటారు. అలాగే కలలో కొన్ని సంకేతాలు వస్తుంటాయి. చాలామంది తెల్లారేసరికి మర్చిపోతారు.. కొందరికి గుర్తుంటాయి.. కానీ దానిని విశ్లేషించుకోలేరు.
విపరీత ధోరణి లో ఉంటాయి
ఇక అదే తెలుగు సినిమాలు అనుకోండి. ఈ విధి సంకేతాలు కూడా చిత్రచిత్రంగా ఉంటాయి. ఉదాహరణకు మనం కారులో వెళ్తుంటే నామాలు పెట్టుకున్న ఎవరో ఒక ముసలాయన అడ్డంగా వచ్చి ” శివుడు నీపై కోపంగా ఉన్నాడు బిడ్డా.. జాగ్రత్త, ఇంటి వాళ్లను అసలు నమ్మకు” అంటూ అరుస్తాడు. అలాగే ఓ సోది చెప్పే మహిళా నేరుగా ఇంట్లోకి వస్తుంది. ” చెడు నీ ఇంటి చుట్టే తిరుగుతోంది. పైలం గా ఉండు తల్లి” అంటూ వెళ్ళిపోతుంది.. ఇక అరుంధతి లాంటి సినిమాలో అయితే ఫకీర్ హెచ్చరికలు జారీ చేస్తాడు.. గాలి నిజమైతే దయ్యం ఎలా అబద్ధం అవుతుందంటూ భయపెట్టిస్తాడు.
ఇక నిన్న నందమూరి తారకరత్న భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్ లో ఉంచారు. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు తరలివచ్చి నివాళులు అర్పించారు. ట్విట్టర్లో బూతులు తిట్టుకునే విజయసాయిరెడ్డి, చంద్రబాబు నాయుడు అరగంట సేపు మాట్లాడుకున్నారు. ఒక్క సాక్షి మినహా మిగతా చానల్స్ మొత్తం, దీన్ని బాగా కవర్ చేశాయి.. ఇక తారకరత్న హాస్పిటల్ చికిత్సల నుంచి డిశ్చార్జ్ అయ్యి, అంత్యక్రియలు పూర్తయ్య దాకా నందమూరి బాలకృష్ణ అక్కడే ఉన్నాడు. అన్ని తానయి నిర్వర్తించాడు. తారకరత్న పిల్లల బాధ్యతలు తాను తీసుకుంటాను అని చెప్పాడు. అందరూ బాలయ్య తన అన్న కుమారుడి పట్ల ప్రదర్శించిన ప్రేమ పట్ల అభినందనలు కురిపించారు.

ఆ అపరిచితుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు?
ఇదంతా జరుగుతుండగానే.. హఠాత్తుగా అక్కడ ఓ అపరిచితుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయనకు ఇదంతా వింతగా తోచింది. బాలకృష్ణకు ఏదో చెప్పాలి అనిపించింది. నేరుగా వచ్చి తారకరత్నకు నివాళులు అర్పించాడు. తర్వాత అక్కడే ఉన్న బాలయ్య వద్దకు వెళ్లాడు.. పెద్ద పెద్ద అరిచాడు.. జాగ్రత్తగా ఉండు అంటూ వేలెత్తి చూపించాడు. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తనే చెప్తున్నాడో బాలయ్య కూడా అంతే శ్రద్ధగా ఉన్నాడు. ఈ మధ్య బాలయ్యలో ఓపిక, సంమయనం పెరిగినట్టు ఉన్నాయి. ఇదంతా జరుగుతుండగానే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.. ఎవరో మతిస్థిమితం లేని వ్యక్తిగా ముద్ర వేశారు. సినిమాటిక్ సన్నివేశం ఉన్న ప్రముఖుల్లో పెద్దగా చర్చనీయాంశమైంది.. నందమూరి కుటుంబంలో విపత్తులు జరుగుతున్న స్థితిలో ఓ పిచ్చోడిలా క కనిపించే అపరిచితుడు వచ్చి బాలయ్యను హెచ్చరించడం దేనికి సంకేతం? ఎవరికి ప్రమాదం? అంతమంది ఉండగా కేవలం బాలయ్యనే ఎందుకు హెచ్చరించాడు?
ఆ వ్యక్తి గురించి ఆరా తీస్తే ఫిలింనగర్ పరిసరాల్లో తిరుగుతూ ఉంటాడని తెలిసింది. స్థానికులు పిచ్చోడిలా జమకట్టి పట్టించుకోరని ప్రాథమిక సమాచారం.. అతగాడి మాటలకు ప్రాధాన్యమివ్వడం అనవసరమని కొట్టిపారేస్తున్నారు.. మరి అతగాడి మాటలు బాలయ్య ఎందుకు విన్నట్టు? తల ఎందుకు ఊపినట్టు? బాలయ్యకు ఏమైనా సంకేతాలు అందాయా? ఏమో దీనికి కాలమే సమాధానం చెప్పాలి.