Homeఎంటర్టైన్మెంట్Sreeleela Biography: సినీ సెలబ్రెటీ బయోగ్రఫీ: శ్రీలీల ఎవరు ఎక్కడి వారు.. సినిమాల్లోకి రాకముందు ఏం...

Sreeleela Biography: సినీ సెలబ్రెటీ బయోగ్రఫీ: శ్రీలీల ఎవరు ఎక్కడి వారు.. సినిమాల్లోకి రాకముందు ఏం చేసింది?

Sreeleela Biography
Sreeleela Biography

Sreeleela Biography: ఈమధ్య ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్స్ వచ్చారు. తమ అందచందాలతో ప్రేక్షకులను అలరించడానికి చాలా ప్రయత్నాలే చేసారు కానీ, ఒక రేంజ్ లో సక్సెస్ అయినా హీరోయిన్ మాత్రం శ్రీలీల మాత్రమే. శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరో గా నటించిన ‘పెళ్లి సందడి’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైనా శ్రీలీల తొలి సినిమాతోనే తన అందం , అభినయం మరియు అద్భుతమైన డ్యాన్స్ తో యూత్ ని ఒక రేంజ్ లో ఆకట్టుకుంది.తొలి సినిమాతోనే ఒక స్టార్ హీరోయిన్ కి ఎలాంటి క్రేజ్ ఉంటుందో అలాంటి క్రేజ్ ని చూసింది శ్రీ లీల.ఆ తర్వాత రవితేజ హీరో గా నటించిన ధమాకా చిత్రంలో హీరోయిన్ గా చేసి మరి భారీ బ్లాక్ బస్టర్ ని కొట్టింది.చాలా యావరేజి గా ఉన్న ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం శ్రీలీల అని కొంతమంది విశ్లేషకులు ఓపెన్ గా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ సినిమా హిట్ తర్వాత చేతిలో వరుసగా అరడజనుకు పైగా సినిమాలలో హీరోయిన్ గా సెలెక్ట్ అయినా శ్రీలీల బయోగ్రఫీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

-బాల్యం/ కెరీర్ :

శ్రీలీల 2001వ సంవత్సరం జూన్ 14వ తేదీన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో బాగా స్థిరపడిన స్వర్ణలత -సూపరనేని శుభకరరావు దంపతులకు జన్మించింది. స్వర్ణలత ప్రస్తుతం బెంగళూరు లో ఒక ప్రముఖ గైనకాలజిస్ట్, ఇక ఆమె భర్త శుభకరరావు ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త. అయితే వీళ్లిద్దరు శ్రీలీల పుట్టకముందే కొన్ని విబేధాలు ఏర్పడి విడిపోవాల్సి వచ్చింది.అయితే శ్రీలీల చిన్నతనం నుండే భరతనాట్యంలో గొప్ప ప్రావీణ్యం సంపాదించింది.ఎన్నో వేదికల మీద ఆమె చిన్నతనం నుండే ప్రదర్శనలు ఇస్తూ వచ్చింది. ఆమెకి తన తల్లిలాగానే డాక్టర్ కావాలని ఎంతో ఆసక్తి ఉండేది.ఆ ఆసక్తి తోనే 2021 వ సంవత్సరం నాటికి తన MBBS చదువుని పూర్తి చేసింది.కొన్నిరోజులు డాక్టరుగా ప్రాక్టీస్ కూడా చేసింది..ఆమె తన మొదటి కన్నడ సినిమా ‘కిస్’ చేస్తున్నప్పుడు కూడా చదువుకుంటూనే ఉంది. పెళ్ళిసందడి సమయంలో ఆమె ఒక పక్క పరీక్షలు రాస్తూ మరో పక్క సినిమా చేసేడట.

-వికలాంగులను దత్తత తీసుకున్న శ్రీలీల:

శ్రీలీల వయస్సు ప్రస్తుతానికి కేవలం 21 సంవత్సరాలు మాత్రమే. కానీ ఆమె ఆలోచన విధానం, తనకి ఉన్న గొప్ప మనసు జీవితాన్ని మొత్తం చూసేసిన ఎంతోమందికి కూడా ఉండదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు ముందు ఉండే శ్రీలీల ఒకరోజు అనాధాశ్రమంలో వికలాంగులుగా ఉన్న శోభిత మరియు గురు అనే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది.వాళ్ళిద్దరిని తన ఇంటికి తీసుకెళ్లి తన సొంత బిడ్డల్ని ఎలా అయితే పోషిస్తుందో అలా పోషిస్తుంది. ఇంత చిన్న వయస్సు లో శ్రీలీల తీసుకున్న ఈ నిర్ణయం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

-పెళ్లి సందడి సినిమాతో కెరీర్లో కీలక మలుపు :

శ్రీలీల పెళ్లి సందడి సినిమాకి ముందే కన్నడలో రెండు చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. మొదటి సినిమా కిస్ పెద్దగా ఆడకపోయినప్పటికీ,ఎవరో ఈ అమ్మాయి మంచి టాలెంటెడ్ అనే ముద్ర జనాల్లో వేసింది.ఆ తర్వాత ఏకంగా తమిళ స్టార్ హీరో శ్రీమురళితో ‘భరత్’ అనే సినిమా చేసింది.ఇది కమర్షియల్ గా బాగా ఆడడమే కాకుండా శ్రీలీల కి మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టింది.అలా ఈ రెండు సినిమాల ద్వారా పాపులారిటీ ని దక్కించుకున్న శ్రీలీల దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దృష్టిలో పడింది. ఆయన నిర్మిస్తూ దర్శకత్వ పర్యవేక్షణ చేసిన పెళ్లి సందడి సినిమాలో హీరోయిన్ అవకాశం దక్కింది.ఈ సినిమా తర్వాత శ్రీలీల రేంజ్ ఎలా మారిపోయింది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

Sreeleela Biography
Sreeleela Biography

ఆ తర్వాత రవితేజతో చేసిన ధమాకా చిత్రం కూడా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈమెకి వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాతో పాటుగా బాలకృష్ణ – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో కూడా ఛాన్స్ వచ్చింది. ఇక ఆ తర్వాత నవీన్ పోలిశెట్టి తో ‘అనగనగా ఒక రాజు’ , నితిన్ తో ఒక చిత్రం, రామ్ తో ఒక చిత్రం మరియు పంజా వైష్ణవ్ తేజ్ తో మరో చిత్రం ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది శ్రీలీల. వీటితో పాటుగా స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఈమెకి హీరొయిన్ అవకాశాలు క్యూ కట్టేస్తున్నాయి, అలా చేతినిండా సినిమాలతో ఈమె ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్స్ అవకాశాలకు గండికొట్టేస్తూ టాప్ స్టార్ హీరోయిన్ గా ఎదిగే దశలో దూసుకుపోతుంది.ఇప్పుడు ఇలా ఉందంటే భవిష్యత్తులో ఈమె రేంజ్ ఎలా ఉంటుందో అని విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

 

ఎజెండా సెట్ చేసిందెవరు? అమలు చేస్తుందెవరు? || Analysis on ABN Radhakrishna Comments on Pawan Kalyan

 

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version