CM Jagan- Balakrishna: కెరీర్ బిగినింగ్ లో బాలకృష్ణ ప్రయోగాలు చేశారు. వాటిలో కొన్ని మంచి ఫలితాలు కూడా ఇచ్చాయి. ఆయనకు ఊర మాస్ స్టార్డం వచ్చాక కొత్తగా ట్రై చేసిన చిత్రాలు పరాజయం పొందాయి. బాలయ్యను ప్రేక్షకులే ఒక జోనర్ కి పరిమితం చేశారు. ఊర మాస్ యాక్షన్ కథలు మాత్రమే ఆయనకు సెట్ అవుతాయని డిసైడ్ అయ్యారు. కాదని బాలయ్య వేరే కథలు చేస్తే రిసీవ్ చేసుకోవడం లేదు. గత రెండు దశాబ్దాలలో బాలయ్య బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ చిత్రాలన్నీ ఫ్యాక్షన్ చిత్రాలే. అఘోరా యాంగిల్ జోడించిన తెరకెక్కించిన అఖండలో కూడా ఒక బాలయ్య ఫ్యాక్షన్ వదిలేసిన లీడర్ లా కనిపించాడు.

విభిన్నమైన చిత్రాలు అందించేందుకు ప్రేక్షకులే స్టార్ హీరోలకు స్కోప్ ఇవ్వడం లేదు. మీరు ఇలా కనిపిస్తేనే మేము చూస్తామంటూ… పరోక్షంగా సందేశం పంపుతున్నారు. నిన్న విడుదలైన వీరసింహారెడ్డి ట్రైలర్ అదిరిపోయింది. ఆయన ఫ్యాన్స్ ఆశించే ప్రతి అంశం ఆ ట్రైలర్ లో ఉంది. ఊర మాస్ డైలాగ్స్, హై వోల్టేజ్ యాక్షన్, రొమాన్స్, సాంగ్స్… కలగలిపి పక్కా సంక్రాంతి చిత్రంగా రూపొందించారు. ఫ్యాక్షన్ కథలన్నీ దాదాపు ఒకటే కాబట్టి టేకింగ్ తో మెప్పించారు అనిపిస్తుంది.
కాగా వీరసింహారెడ్డి మూవీలో ఏపీ సీఎం జగన్ ని బాలయ్య ఓ రేంజ్ లో వేసుకున్నాడు. ఆ మధ్య పెద్ద వివాదానికి దారి తీసిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును ఉద్దేశిస్తూ పంచ్ డైలాగ్ కొట్టాడు. విజయవాడలో ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును సీఎం జగన్ ప్రత్యేక జీవో ద్వారా వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ గా మార్చారు. దీన్ని టీడీపీ వర్గాలు పెద్ద ఎత్తున వ్యతిరేకించాయి. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు సైతం నిరసన వ్యక్తం చేశారు.

ఈ అంశాన్ని ఉద్దేశిస్తూ ” సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో , కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు , మార్చలేరు” అని బాలకృష్ణ సీఎం జగన్ కి చురకలు వేశాడు. పేరు మార్చినంత మాత్రాన ఎన్టీఆర్ కీర్తి, చరిత్ర మరుగున పడదని బాలయ్య పరోక్షంగా ఆ డైలాగ్ తో చెప్పాడు. ” పదవి చూసుకొని నీకు పొగరేమో… బై బర్త్ నా డిఎన్ఏ కే పొగరెక్కువా” అని చెప్పిన డైలాగ్ కూడా జగన్ ని ఉద్దేశించే అనిపిస్తుంది. ట్రైలర్ లోనే ఇన్ని డైలాగ్స్ ఉంటే… సినిమాలో సీఎం జగన్ నిర్ణయాలపై పంచ్ డైలాగ్స్ చాలానే కొట్టి ఉంటాడు బాలయ్య అనిపిస్తుంది.