Balakrishna- CM Jagan: నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘వీర సింహా రెడ్డి’ సినిమా ఈ నెల 12 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వబోతుంది..ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని నిన్న విడుదల చేసారు..ఫుల్ మాస్ కట్స్ తో బాలయ్య మార్క్ కనిపించింది..అభిమానులు పండుగ చేసుకున్నారు..అఖండ వంటి భారీ సెన్సేషనల్ హిట్ తర్వాత మరో సూపర్ హిట్ బాలయ్య కొట్టబోతున్నాడు అంటూ మురిసిపోయారు..ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఒంగోలు లో జరిగింది.

ఈ ఈవెంట్ కి అభిమానులు వేలాది సంఖ్యలో హాజరయ్యారు..అయితే నిన్న విడుదల చేసిన ట్రైలర్ లో బాలయ్య ఎక్కువగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ని టార్గెట్ చేస్తూ డైలాగ్స్ చెప్పినట్టు అనిపించింది..గత ఏడాది విజయవాడ లో ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు YSR పేరు కి మార్చిన ఘటన ఎంత పెద్ద వివాదానికి దారి తీసిందో తెలిసిందే..తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సంఘటన ని ఉద్దేశిస్తూ ట్రైలర్ లో బాలయ్య ఒక డైలాగ్ చెప్తాడు..’సంతకాలు పెట్టి బోర్డు మీద పేర్లు మార్చొచ్చు..కానీ ఆ చరిత్ర మారాడు..వాడి పేరు మారదు..మార్చలేరు’ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..దీనిపై వైసీపీ నాయకులూ కూడా స్పందించే అవకాశం ఉంది..తన ప్రభుత్వం పై టార్గెట్ చేసే హీరోల సినిమాలను ఇబ్బంది పెట్టే అలవాటు ఉన్న జగన్ కి బాలయ్య సినిమాకి ఎన్ని ఇబ్బందులు పెడుతాడో.

టికెట్ రేట్స్ కి అనుమతి ఇస్తాడా లేదా అనే భయం అభిమానుల్లో పట్టుకుంది..ట్రైలర్ లో అలా టార్గెట్ చెయ్యకుండా ఉండుంటే బాగుండేదని కొంతమంది అభిమానుల అభిప్రాయం..ఇక సినిమాకి మొన్ననే సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు..బాలయ్య మార్క్ మాస్ మసాలా ఎంటర్టైనర్ అని సెన్సార్ సభ్యులు కితాబు ఇచ్చినట్టు తెలుస్తుంది..చూడాలిమరి అభిమానుల అంచనాలను ఈ సినిమా ఎంత వరకు అందుకుంటుందో అనేది.
