Trending Video: ఆ బాలుడు వయసు నెలలలోపే ఉంటుంది. చూడ్డానికి చాలా అందంగా ఉన్నాడు. అమ్మ చనుబాలు తాగుతూ.. ఆమె పొత్తిళ్లలో సేదతీరుతూ.. ఊయలలో వెచ్చగా పడుకోవలసిన ఆ బాలుడు.. బాల్కనీ నుంచి జారాడు. అలాగని కింద పడలేదు. మధ్యలో చిక్కుకుపోయాడు. చెన్నై నగరంలోని ఓ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది. దానికి సంబంధించిన వీడియో చర్చనీయాంశంగా మారింది. చూసేవాళ్లకు ఆ దృశ్యం నరాలు తెగే ఉత్కంఠను కలిగించింది. కాళ్లు, చేతులు వణికి పోయేలా చేసింది. అదృష్టం కొద్దీ ఆ బాలుడు బాల్కనీ నుంచి ప్లాస్టిక్ షీట్ పై పడిపోయాడు. మెల్లగా కిందికి జారాడు. దీంతో చుట్టుపక్కల వారు భయంతో కేకలు వేశారు. చిన్నారిని కాపాడుకునేందుకు కింద పెద్ద బెడ్ షీట్ పట్టుకొని నిల్చుని ఉన్నారు. అయితే ఆ సమయంలో మొదటి అంతస్తులో ఉన్న కొందరు ఆ బాలుడిని జాగ్రత్తగా కాపాడారు.
ఈ దృశ్యాన్ని కొంతమంది వీడియో తీశారు. ఆ వీడియో చూస్తుంటే చిన్నారిని స్థానికులు కాపాడిన విధానం కళ్ళు చెమ్మగిల్లేలా చేసింది. వాస్తవానికి ఆ చిన్నారి జారుకుంటూ కింద వ్యక్తులు పట్టుకొని ఉన్న బెడ్ షీట్ మీద పడతాడని అందరూ అనుకున్నారు. కానీ, ఈలోగా మొదటి అంతస్తులో ఉన్న కొంతమంది వ్యక్తులు అప్రమత్తమయ్యారు. అత్యంత ఒడుపుగా కిటికీ మీదుగా బయటికి వచ్చి ఆ బాలుడిని కిందకు తీసుకునే ప్రయత్నం చేశారు. అతడు కింద పడకుండా అత్యంత జాగ్రత్తగా పట్టుకున్నారు. దీంతో అందరూ హమ్మయ్యా అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు.
A child accidentally fell from a balcony, got stuck in a shed, and was rescued by people after a few minutes of struggling at Choolaimedu area in #Chennai pic.twitter.com/u467mXoXrp
— ʜᴀɴᴅʀᴇꜱʜ | சந்திரேஷ் (@gschandresh) April 28, 2024
వాస్తవానికి ఆ బాలుడు అలా బాల్కనీ నుంచి ఎలా బయటికి వచ్చి.. ప్లాస్టిక్ షీట్ మీద పడిపోయాడనేది ఇంతవరకూ అంతు పట్టడం లేదు. ఆ బాలుడు అలా పడిపోతుంటే తల్లిదండ్రులు ఏం చేశారు? అసలు ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేదా? అలాంటి పసి బాలుడు దయనీయ స్థితిలో ఉంటే.. కొంచెం కూడా జాగ్రత్తగా ఉండరా? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రమాదంలో పడిన ఆ బాలుడిని కాపాడేందుకు చాలామంది ప్రజలు రావడాన్ని చూసి నెటిజన్లు అభినందిస్తున్నారు.