
రాజన్న సినిమాలో ఆడిపాడిన చిన్నారిని చూస్తే ఎంత ముచ్చటేస్తుంది. సినిమా కథలో భాగంగా తల్లిదండ్రి చనిపోతే ఓ తాత దగ్గర పెరిగిన ఈ చిన్న పిల్ల అప్పటి తెలంగాణ జమీందారులు, నైజంతో పోరాడిన తీరు , ఎమోషనల్ సీన్లలో ఏడిపించిన తీరు అందరినీ కట్టిపడేస్తుంది.
రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ తీసిన ఈ రాజన్న చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యింది. ఆ సినిమాతో బేబీ అన్ని నటనకు ప్రశంసలు కురిశాయి.
ఇప్పుడా చిన్నారి పెరిగి పెద్దది అయ్యింది. హీరోయిన్ స్థాయిలో అందాన్ని సొంతం చేసుకుంది. ఇన్ స్టాగ్రామ్ లో తాజాగా తన ఫొటోలను షేర్ చేసింది.
చూస్తుంటే ఈ రాజన్న చిన్న పిల్ల ఈమెనా? అని డౌట్ రాకమానదు. త్వరలోనే టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవున్న ‘అన్నీ’ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.