పీఎఫ్ ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త.. ఖాతాల్లోకి డబ్బులు ఎప్పుడంటే..?

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పీఎఫ్ ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఈ నెలలో పీఎఫ్ ఖాతాదారుల ఖాతాల్లో నగదు జమ కానుందని తెలుస్తోంది. 2020 – 21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ డబ్బులు పీఎఫ్ ఖాతాదారుల ఖాతాలలో ఈ నెలలో జమ కానుండటం గమనార్హం. మోదీ సర్కార్ పీఎఫ్ ఖాతాలకు 8.5 శాతం వడ్డీరేటును అందిస్తున్న సంగతి తెలిసిందే. గడిచిన ఏడు సంవత్సరాలలో ప్రస్తుతం అమలు చేస్తున్న వడ్డీ రేటు తక్కువ వడ్డీరేటు అని […]

Written By: Kusuma Aggunna, Updated On : July 24, 2021 8:57 pm
Follow us on

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పీఎఫ్ ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఈ నెలలో పీఎఫ్ ఖాతాదారుల ఖాతాల్లో నగదు జమ కానుందని తెలుస్తోంది. 2020 – 21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ డబ్బులు పీఎఫ్ ఖాతాదారుల ఖాతాలలో ఈ నెలలో జమ కానుండటం గమనార్హం. మోదీ సర్కార్ పీఎఫ్ ఖాతాలకు 8.5 శాతం వడ్డీరేటును అందిస్తున్న సంగతి తెలిసిందే.

గడిచిన ఏడు సంవత్సరాలలో ప్రస్తుతం అమలు చేస్తున్న వడ్డీ రేటు తక్కువ వడ్డీరేటు అని తెలుస్తోంది. నివేదికల ప్రకారం ఈ నెల చివరినాటికి పీఎఫ్ ఖాతాదారుల ఖాతాలలో కచ్చితంగా నగదు జమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. పీఎఫ్ ఖాతాదారులు వెబ్ సైట్ ద్వారా తమ పీఎఫ్ ఖాతాల్లో వడ్డీ నగదు జమైందో లేదో సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం పీఎఫ్ ఖాతాదారులు ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌ లోకి సులభంగా చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

యూఏఎన్, పాస్‌వర్డ్ సహాయంతో పీఎఫ్ ఖాతాదారులు సులువుగా తమ పీఎఫ్ ఖాతాల్లో బ్యాలెన్స్ ను చెక్ చేసుకోవచ్చు. ఉమాంగ్ యాప్ కూడా పీఎఫ్ ఖాతాదారులకు సులభంగానే బ్యాలెన్స్ ను చెక్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తుండటం గమనార్హం. 7738299899 నంబర్ కు epfoho అని రిజిష్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి మెసేజ్ పంపించడం ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ ను తెలుసుకోవచ్చు.

011 – 22901406 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. పీఎఫ్ ఖాతాకు లింక్ అయిన మొబైల్ నంబర్ నుంచి మాత్రమే కాల్ లేదా మెసేజ్ చేయడం ద్వారా ఈ వివరాలను తెలుసుకోవచ్చు.