https://oktelugu.com/

Viral: పెళ్లిపీటలపై వరుడు చేసిన పనికి వధువు షాక్

అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతోంది. మేళతాళాలు.. గ్రాండ్ గా ఏర్పాట్లు.. మంచి బిర్యానీ వంటలు.. వధూ వరుల తల్లిదండ్రులు చుట్టూ సందడిగా ఉన్న వేళ వరుడు మాత్రం ఏంతో టెన్షన్ పడుతూ కనిపించాడు.. తీరా చూస్తే వెంటనే ల్యాప్ ట్యాప్ తీసి ఆ పెళ్లి పీటల మీదే సీరియస్ గా వర్క్ చేస్తున్నాడు. పక్కనే కూర్చున్న పెళ్లికూతురు.. పెళ్లి కొచ్చిన వారు స్టన్ అయిపోయారు. ఏంటని ఆరాతీస్తే వర్క్ ఫ్రం హోం అని.. పెళ్లికి కూడా సెలవు […]

Written By:
  • NARESH
  • , Updated On : July 24, 2021 / 09:12 PM IST
    Follow us on

    అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతోంది. మేళతాళాలు.. గ్రాండ్ గా ఏర్పాట్లు.. మంచి బిర్యానీ వంటలు.. వధూ వరుల తల్లిదండ్రులు చుట్టూ సందడిగా ఉన్న వేళ వరుడు మాత్రం ఏంతో టెన్షన్ పడుతూ కనిపించాడు..

    తీరా చూస్తే వెంటనే ల్యాప్ ట్యాప్ తీసి ఆ పెళ్లి పీటల మీదే సీరియస్ గా వర్క్ చేస్తున్నాడు. పక్కనే కూర్చున్న పెళ్లికూతురు.. పెళ్లి కొచ్చిన వారు స్టన్ అయిపోయారు.

    ఏంటని ఆరాతీస్తే వర్క్ ఫ్రం హోం అని.. పెళ్లికి కూడా సెలవు ఇవ్వలేదని పెళ్లికొడుకు బోరుమన్నాడు. జాబ్ పోతుందని పెళ్లి పీటల మీదనే వరుడు ల్యాప్ ట్యాప్ తో కుస్తీ పట్టాడు.. ఈ వీడియో ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

    వర్క్ ఫ్రం హోం వల్ల మనిషి జీవితంలో ఎంతటి ప్రశాంతత కరువైందో ఈ చిత్రం దృశ్యాలు అందరికీ అర్థమయ్యేలా చేశాయి. ఇన్నాళ్లు ఆఫీసులో టైం ప్రకారం చేసి వచ్చేవాల్లం.. ఇప్పుడు ఉదయం నుంచి రాత్రి దాకా వర్క్ ఫ్రం హోం పేరిటసాగుతున్న ఈ తంతు వల్ల మనకు మనశ్శాంతి కరువైన పరిస్థితి నెలకొంది.

    వీడియోను కింద లింక్ లో చూడొచ్చు.