Homeట్రెండింగ్ న్యూస్Baba Vanga: ప్రపంచ అంతానికి బీజం.. సంకేతాలు అవే.. బాబా వంగా జోష్యం!

Baba Vanga: ప్రపంచ అంతానికి బీజం.. సంకేతాలు అవే.. బాబా వంగా జోష్యం!

Baba Vanga: బాబావంగా… దివ్య దృష్టి కలిగిన బల్గేరియన్‌ కాలజ్ఞాని. ఈమెను నోస్ట్రాడమస్‌ ఆఫ్‌ బాల్కన్స్‌ అని కూడా పిలుస్తారు. రెండో ప్రపంచ యుద్దం లాంటి ప్రధాన ఘటనలను ఈమె ముందే ఊహించారని చెబుతారు. రాబోయే సవంత్సరం.. అంటే 2025లో జరిగే ఓ ఘటన గురించి ముందే చెప్పారు. దీంతో ప్రపంచ అంతానికి బీజం పడుతుందని అంచనా వేశారు.

భారీ యుద్ధం..
2025లో ఐరోపాలో ఓ భారీ యుద్ధం జరుగుతుందని బాబా వంగా హెచ్చరించారు. ఇది ప్రపంచ జనాభాకు భారీ చేటు చేస్తుందని వెల్లడించారు. 5079 నాటికి మానవ జాతి పూర్తిగా నాశనం అవుతుందని జోష్యం చెప్పారు. ఆ ప్రక్రియ 2025లో జరిగే ఈ యుద్ధంతోనే మొదలువుతుందని తెలిపారు. 2043 నాటికి యూరప్‌ ముస్లిం పాలనలోకి వస్తుందని, 2076 నాటికి కమ్యూనిజం ప్రపంచవ్యాప్తంగా తిరిగి విస్తరిస్తుందని అంచనా వేశారు.

భూమిపైకి గ్రహాంతర జీవులు..
ఇక వచ్చే ఏడాది భూమిపైకి గ్రహాంతర జీవులు వస్తాయని, ఈ జీవులు భూమిపై తమ ఉనికిని చాటుకుంటాయని తెలిపారు. 16వ శతాబ్దపు ఫ్రెంచ్‌ జోతిష్కుడు నోస్ట్రాడమస్‌ కూడా ఇదే విధమైన అంచనాలు వేశారు. ఆయన 2025లో జరగబోయే యూరోపియన్‌ యుద్ధం గురించి ప్రస్తావించారు. బాబా వంగా భవిష్యత్‌లో జరుగబోయే వాతారవణ మార్పుల కారణంగా ఏర్పడే కరువులు, అడవుల్లో కార్చిచ్చు తదితర పర్యావరణ విపత్తులను ముందుగానే అంచనా వేశారు. బాబా వంగా 1911 అక్టోబర్‌ 3న జన్మించారు. తన 84 ఏళ్ల వయసులో 1996 ఆగస్టు 11న కన్నుమూశారు.

నిజమైన బాబా అంచనాలు…

– రెండో ప్రపంచ యుద్ధం, విధ్వంసం, భారీ మరణాలు

– సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నం అవుతందని.. యూఎస్‌ఎస్‌ఆర్‌ పతనాన్ని 1991కి ముందే ఊహించారు.

– చెర్నోబిల్‌ విపత్తును బాబా వంగా మెందే ఊహించారు.. 1986లోనే వెల్లడించారు.

– స్టాలిన్‌ మరణం.. బాబా వంగా ముందే చెప్పారు.

– కుర్స్‌ జలాంతర్గామి విపత్తు.. 2000కి ముందే వంగా అంచనా వేశారు.

– సెప్టెంబర్‌ 11 దాడులు.. ఉక్కు పక్షులు అమెరికాపై దాడి చేస్తాని బాబా వంగా ముందే వెల్లడించారు.

– సునామీ.. హిందూ మహాసముద్రంలో విధ్వంసకర సునామీ ప్రమాదం వస్తుందని అంచనా వేశారు. 2004 జరిగింది.

– 1985 భూకంపం.. ఉత్తర బల్గేరియాలో భూకంపం వస్తుందని వంగా అంచా వేశారు.

– ఇక 9/11 దాడులతో సహా పలు ముఖ్యమైన ఘటనలలో బాబా వంగా భవిష్యత్‌ అంచనాలు వేశారు. వాటిలో 85 శాతం నిజమయ్యాయని నిపుణులు చెబుతుంటారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular