Avatar 2 OTT: డిసెంబర్ 16 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 180 కి భాషల్లో విడుదలైన ‘అవతార్ 2’ చిత్రం పాజిటివ్ టాక్ ని తెచ్చుకొని థియేటర్స్ లో విజయవంతం గా నడుస్తుంది..ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోతున్నప్పటికీ కూడా వీక్ డేస్ లో డీసెంట్ స్థాయి హోల్డ్ ని సాధించి పర్వాలేదు అనే రేంజ్ వసూళ్లను సొంతం చేసుకుంటూ ముందుకెళ్తుంది..ఈ చిత్రాన్ని జేమ్స్ కెమరూన్ 2 బిలియన్ ఖర్చు చేసి తీసాడు..ఇప్పుడు వస్తున్న వసూళ్లు ఇంకో నాలుగు వారాలపాటు వస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

ఫుల్ రన్ మీదనే అందరూ నమ్మకాలు పెట్టుకున్నారు..2009 లో విడుదలైన అవతార్ కూడా అంతే..సుమారుగా 3 బిలియన్ డాలర్లను ఫుల్ రన్ లో రాబట్టింది ఆ చిత్రం..అయితే ఆరోజుల్లో ఓటీటీ లాంటివి లేవు కాబట్టి ఎక్కువ రోజులు రన్ ఉండేది..కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు..ఎంత పెద్ద సినిమా అయినా టికెట్ రేట్స్ ఎక్కువ ఉంటే ఓటీటీ లో చూసుకోవచ్చులే అని అనుకుంటున్నారు.

అవతార్ 2 చిత్రం 3D ,4DX మరియు ఐమాక్స్ ఫార్మట్స్ లో తెరకెక్కించారు..టికెట్ రేట్స్ కూడా సామాన్యులకు అందుబాటులో లేని విధంగా ఉన్నాయి..అందుకే ఈ సినిమాని ఓటీటీ లో విడుదల అయితే చూద్దామని ఎదురు చూసే వాళ్ళ సంఖ్య లక్షల్లోనే ఉంటుంది..అలాంటి అభిమానులకు ఇప్పుడు ఒక శుభ వార్త..ఈ చిత్రం జనవరి 29 వ తారీఖున ఓటీటీ లో అందుబాటులోకి రాబోతుందని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం..డిజిటల్ రైట్స్ మొత్తం డిస్నీ + హాట్ స్టార్ సంస్థ కనీవినీ ఎరుగని రేట్ కి కొనుగోలు చేసింది..తెలుగు , హిందీ , ఇంగ్లీష్ , తమిళం మరియు మలయాళం బాషలలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతుంది..మరి థియేటర్స్ లో చూడడానికి బద్ధకించే ప్రేక్షకులు ఓటీటీ రిలీజ్ కోసం మరో నెల రోజులకు పైగా ఎదురు చూడాల్సిందే.