
Australia: వారంతా పొట్ట కూటి కోసం చేపల వేటకు వెళతారు. రోజువారి గానే ఆ రోజు కూడా చేపల వేటకు బయలుదేరారు. మార్గమధ్యంలోకి వెళ్లేసరికి తుపాన్ వచ్చింది. దీంతో రెండు పడవలు చెల్లాచెదురయ్యాయి. ఒక పడవ మునిగింది. అందులో ఉన్న వారు ప్రాణాలు కోల్పోయారు. కళ్ల ముందే వారు చనిపోవడం చూసిన వారు భయాందోళన చెందారు. తమకు కూడా మరణమే శరణ్యమని భావించారు. వారి పడవ చివరకు ఆస్ట్రేలియా తీరం చేరింది.
అక్కడ ఇసుక తప్ప ఏమి లేదు. చుట్టు నీళ్లు ఉన్నా తాగేందుకు పనిచేయవు. వారం రోజులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సాయం కోసం ఎదురు చూశారు. ఎవరు రాకపోతే ఇక మాకు కూడా మరణమే అని ఫిక్స్ అయ్యారు. కానీ ఏ దేవుడు వారి మొర ఆలకించాడో కానీ ఆస్ర్టేలియా తీరంలో నేర నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన గస్తీ హెలికాప్టర్ అటు వైపు రావడంతో వారి ప్రాణాలు లేచి వచ్చాయి. తొమ్మిది మంది వారం రోజుల పాటు ఆకలికి తట్టుకుని నిలవడం గమనార్హం.
సాయం కోసం వారు అరిచిన అరుపులు విన్న గస్తీ సిబ్బంది వారిని రక్షించేందుకు నిర్ణయించారు. కానీ అక్కడ హెలికాప్టర్ ల్యాండయ్యే అవకాశాలు లేకపోయినా వారి ప్రాణాలు కాపాడారు. వారిని ఆస్పత్రికి తరలించారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించి పూర్తిస్థాయిలో ఆరోగ్యంగా ఉన్నారని చెప్పడంతో వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ ప్రాణాలు కాపాడిన వారిని దేవుళ్లుగా భావిస్తున్నారు. వారికి మొక్కుతున్నారు.

ఆపదలో ఉన్నప్పుడు కూడా సంయమనంతో ఉంటే ఏదైనా సాయం దొరకవచ్చు. కానీ వారు మాత్రం తమ ప్రాణాలు కచ్చితంగా పోతాయనే అనుకున్నారు. కానీ వారికి భూమి మీద నూకలు బాకీ ఉండటంతో వారిని రక్షించారు. మొత్తానికి వారు చేసిన సాయానికి ఎంతో పొంగిపోతున్నారు. తమ ప్రాణాలు కాపాడిన దేవుళ్లని కొలుస్తున్నారు. వారు రాకపోతే తమ ప్రాణాలు అక్కడే పోయేవని విచారం వ్యక్తం చేస్తున్నారు.