https://oktelugu.com/

ఓటీటీకి పోటీగా వస్తున్న ఏటీటీలు..!

కరోనా.. లాక్డౌన్ ఎఫెక్ట్ కు చిత్రపరిశ్రమ కుదేలపోయింది. గత తొమ్మది నెలలుగా థియేటర్లు మూతపడగా.. షూటింగులు నిలిచిపోయాయి. కొద్దికాలంగా షూటింగ్ ప్రారంభమైన కరోనా గుబులు మాత్రం సినిమావాళ్లను మాత్రం వీడటం లేదు. ఇటీవల థియేటర్ల ఓపెనింగ్ కు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన థియేటర్ల నిర్వాహకులు మాత్రం పూర్తిస్థాయిలో తెరిచేందుకు ఆసక్తి చూపడం లేదు. Also Read: వెంకీ కంటే కోటి ఎక్కువ అడుగుతున్నాడు ! అయితే కరోనా మార్గం టాలీవుడ్ కు కొత్త మార్గం చూపించింది. థియేటర్లు […]

Written By:
  • NARESH
  • , Updated On : November 29, 2020 / 06:28 PM IST
    Follow us on

    కరోనా.. లాక్డౌన్ ఎఫెక్ట్ కు చిత్రపరిశ్రమ కుదేలపోయింది. గత తొమ్మది నెలలుగా థియేటర్లు మూతపడగా.. షూటింగులు నిలిచిపోయాయి. కొద్దికాలంగా షూటింగ్ ప్రారంభమైన కరోనా గుబులు మాత్రం సినిమావాళ్లను మాత్రం వీడటం లేదు. ఇటీవల థియేటర్ల ఓపెనింగ్ కు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన థియేటర్ల నిర్వాహకులు మాత్రం పూర్తిస్థాయిలో తెరిచేందుకు ఆసక్తి చూపడం లేదు.

    Also Read: వెంకీ కంటే కోటి ఎక్కువ అడుగుతున్నాడు !

    అయితే కరోనా మార్గం టాలీవుడ్ కు కొత్త మార్గం చూపించింది. థియేటర్లు మూతపడటంతో నిర్మాతలు తమ సినిమాలను OTT(Over The Top)లో రిలీజ్ చేశారు. అమెజాన్.. నెట్ ఫిక్స్.. డిస్నీ+హాట్ స్టార్.. ఆహా వంటి తదితర ఓటీటీలు కరోనా కాలంలో ఇబ్బడిముబ్బడిగా కొత్త సినిమాలను రిలీజై చేసి సబ్ స్ట్రైబర్లను పెంచుకున్నాయి.

    ఓటీటీలను వార్షిక ప్రతిపాదికన కొంతమొత్తం చెల్లించి సబ్ స్ర్కైబ్ చేసుకుంటే ఈ ఏడాది మొత్తం రిలీజైన సినిమాలన్నీ చూసుకోవచ్చు. దీనికి భిన్నంగా ATT(Any Time Theatre) ఉన్నాయి. ఇప్పటి వరకు టాలీవుడ్లో శ్రేయస్ ఏటీటీ ఒకటి మాత్రమే ఉంది. ఈ ఏటీటీలో ఒక కొత్త సినిమా విడుదలైతే దానికి పేమెంట్ చేసి సినిమా చూడాలి.. మరో సినిమా రిలీజైతే మరోసారి సినిమా చూడాల్సిందే. అంటే థియేటర్ల మాదిరి టిక్కెట్ల లెక్క అన్నమాట.

    Also Read: పాలిటిక్స్ లోకి అల్లు అర్జున్.. టాలీవుడ్లో చర్చ..!

    టాలీవుడ్లో ఓటీటీలకు పోటీగా ప్రస్తుతం ఏటీటీలు వస్తున్నాయి. ఇప్పటికే శ్రేయాస్ ఏటీటీగా ఉండగా త్వరలోనే మరో ఏటీటీ రాబోతుంది. బన్నీ వాస్.. అతడి మిత్రుడు కేదార్ వచ్చేనెలలో ఏటీటీని ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఏటీటీ నిర్వహాకులు ఆరేడు సినిమాలతో ఒప్పందం చేసుకున్నట్లు టాక్ విన్పిస్తోంది. ఇప్పటికైతే ప్రేక్షకులంతా ఓటీటీలవైపు మొగ్గుచూపున్నాయి.

    ఏటీటీల్లో సినిమాలు చూడాలంటే మాత్రం ప్రతీ సినిమాకు డబ్బు చెల్లించాల్సి రావడం మాత్రం ఏటీటీలకు మైసన్ అని చెప్పొచ్చు. ఏదిఏమైనా ఓటీటీలకు పోటీగా ఏటీటీలు వస్తున్నాయి. అయితే ఓటీటీలకు ఏటీటీలు ఏమాత్రం పోటీ ఇస్తాయనేది మాత్రం వేచిచూడాల్సిందే..!

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్