కృష్ణా జిల్లా మంత్రి పేర్నినానిపై హత్యాయత్నం జరిగింది. మచిలీపట్నంలోని ఆయన నివాసంలో గుర్తు తెలియని వ్యక్తి తాపీతో దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన మంత్రి నాని అనుచరులు నిందితుడిని పట్టుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. లేకుంటా నాని ప్రాణాలకే ముప్పు వాటిల్లేది.
Also Read: కవితకు గట్టి కౌంటర్ ఇచ్చిన బండ్ల గణేష్
మచిలీపట్నంలోని ఆయన నివాసం వద్ద నాగేశ్వరరావు అనే వ్యక్తి తాపీతో మంత్రిపై దాడి చేశాడు. మంత్రి నాని ఈ ఘటనలో తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనపై తాజాగా పేర్ని నాని స్పందించాడు.
కృష్ణా జిల్లా ఎస్పీ కూడా దీనిపై మాట్లాడారు. మంత్రి పేర్ని నానిపై దాడి ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని.. హత్యాయత్నం కేసు నమోదు చేశామని తెలిపారు. కొద్దిరోజులుగా పనిలేకపోవడంతో ఆ తాపీ మేస్త్రీ ఈ ఘటనకు పాల్పడ్డారని వెల్లడించారు. పూర్తి విచారణ తర్వాత హత్యాయత్నంకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
Also Read: గ్రేటర్ లో పవన్ అందుకే ప్రచారం చేయలేదా?
‘మా ఇంటి గేటు వద్ద ఒక వ్యక్తి తన కాళ్లపై పడ్డాడని.. ఎవరో గుర్తించేలోగానే పొడిచేందుకు ప్రయత్నించాడని’ మంత్రి నాని తెలిపాడు. తప్పించుకోగా మరోసారి పొడవాలని చూశాడని తెలిపారు. వెంటనే తన అనుచరులు అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారని వివరించాడు. ఎందుకు దాడి చేశాడో తెలియదని.. పోలీసులు విచారణ జరుపుతున్నారని మంత్రి నాని వివరించారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్