https://oktelugu.com/

Machilipatnam: తండ్రి స్థానంలో ఉన్న వాడే కీచకుడిగా మారితే..

Machilipatnam: మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అన్నారో సినీకవి. అది అక్షరాల నిజమే అనిపిస్తోంది. మనిషిలో రాక్షసుడు దాడి ఉన్నాడు. దీంతోనే తనలోని రాక్షస భావాలు అప్పుడప్పుడు బయటకు వస్తుంటాయి. కూతురులా చూసుకోవాల్సిన బాలికపై తండ్రి స్థానంలో ఉన్న ఓ కసాయి కన్ను వేశాడు. ఇంకేముంది తన కోరిక తీర్చుకున్నాడు. పదినెలలుగా ఆమెను లోబరుచుకుని పశువాంఛ తీర్చుకుంటున్నాడు. ఫలితంగా ఆమె గర్భవతిగా మారింది. అత్యంత జుగుస్సాకరమైన ఈ ఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది. భర్త దూరం కావడంతో ఓ వ్యక్తితో సహజీవనం […]

Written By: , Updated On : April 30, 2022 / 01:28 PM IST
Follow us on

Machilipatnam: మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అన్నారో సినీకవి. అది అక్షరాల నిజమే అనిపిస్తోంది. మనిషిలో రాక్షసుడు దాడి ఉన్నాడు. దీంతోనే తనలోని రాక్షస భావాలు అప్పుడప్పుడు బయటకు వస్తుంటాయి. కూతురులా చూసుకోవాల్సిన బాలికపై తండ్రి స్థానంలో ఉన్న ఓ కసాయి కన్ను వేశాడు. ఇంకేముంది తన కోరిక తీర్చుకున్నాడు. పదినెలలుగా ఆమెను లోబరుచుకుని పశువాంఛ తీర్చుకుంటున్నాడు. ఫలితంగా ఆమె గర్భవతిగా మారింది.

Machilipatnam

Machilipatnam

అత్యంత జుగుస్సాకరమైన ఈ ఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది. భర్త దూరం కావడంతో ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోంది మహిళ. ఆమెకు అప్పటికే ఓ కూతురు ఉంది. దీంతో ఆమెను బిడ్డలా చూసుకోవాల్సిన అతడు ఆమెపై కన్నేశాడు. దీంతో ఆ మహిళ లేని సమయాల్లో ఆమెపై అఘాయిత్యం చేస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆమె గర్భం దాల్చడం సంచలనం సృష్టించింది.

Also Read: Dreams: కలలో వీటిని చూశారా? మీరు ధనవంతులు అవుతారట?

వావి వరస ఏదీ లేదు కోరిక తీరడమే కావాలి. ఎవరైనా ఫర్వాలేదు. కన్న తండ్రిలా భావించుకోవాల్సిన అతడే కంచే చేను మేసినట్లు బాలిక జీవితాన్ని కకావికలం చేశాడు. బాలిక గర్భం దాల్చడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు బాలిక పరిస్థితి ఏంటి? ఆమెకు తోడు ఉండే వారెవరు? ఆమె జీవితం నాశనం అయింది. పశువులా ప్రవర్తించిన నిందితుడు సురేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అతడు టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.

Machilipatnam

Machilipatnam

ప్రస్తుతం బాలిక జీవితం మాత్రం ఎటు పనికి రాకుండా పోయింది. క్షణికావేశానికి ఆమె బలైంది. జీవితాంతం ఆమె ఎలా ఉండాలి. ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనే ప్రశ్నలు వస్తున్నాయి. మొత్తానికి రాష్ట్రంలో ఇలాంటి కేసులు కోకొల్లలుగా వస్తున్నాయి. అయినా అధికారంలో ఉన్న పాలకులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. అభం శుభం తెలియని బాలిక పరిస్థితికి ఎవరు బాధ్యులు. ఎవరిని నిందించాలి. ఎవరిపై కేసు పెట్టాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.

Also Read:Janasena: ఇన్నాళ్లు తిడితే పడే జనసేన.. ఇప్పుడు మీదపడిపోతోందేంటి?

Tags