https://oktelugu.com/

Star Heroine: మత్తులో సర్వం కోల్పోతున్న స్టార్ హీరోయిన్ ?

Star Heroine: చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఆ హీరోయిన్. లక్కీగా మొదటి సినిమా హిట్ అయినా, ఏడాది వరకూ అవకాశాలు రాలేదు ఆమెకు. అరె ఈ అమ్మాయి అందంగా ఉంది, పైగా పొడగరి, సొగసరి అంటూ ఆమెకు మంచి పొగడ్తలు లభించాయి గానీ, ఆ టైంలో ఒక్క అవకాశం కూడా రాలేదు. ఆ సమయంలోనే ఆమె కొంచెం ట్రాక్ తప్పాల్సి వచ్చింది. ఓ మేనేజర్ తో ఏర్పడిన పరిచయం కారణంగా, ఆమె అప్పుడు డ్రగ్స్ కి […]

Written By:
  • Shiva
  • , Updated On : April 30, 2022 / 01:50 PM IST
    Follow us on

    Star Heroine: చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఆ హీరోయిన్. లక్కీగా మొదటి సినిమా హిట్ అయినా, ఏడాది వరకూ అవకాశాలు రాలేదు ఆమెకు. అరె ఈ అమ్మాయి అందంగా ఉంది, పైగా పొడగరి, సొగసరి అంటూ ఆమెకు మంచి పొగడ్తలు లభించాయి గానీ, ఆ టైంలో ఒక్క అవకాశం కూడా రాలేదు. ఆ సమయంలోనే ఆమె కొంచెం ట్రాక్ తప్పాల్సి వచ్చింది. ఓ మేనేజర్ తో ఏర్పడిన పరిచయం కారణంగా, ఆమె అప్పుడు డ్రగ్స్ కి అలవాటు పడింది.

    Star Heroine

    కానీ అంతలో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. వచ్చిన అవకాశాలకు తోడు భారీ హిట్స్ పడ్డాయి. కట్ చేస్తే.. ఆమె స్టార్ హీరోయిన్ అయిపోయింది. మంచి సినిమాలు చేసింది. అలాగే మంచి నటి అనిపించుకుంది. పైగా అందరి స్టార్ హీరోల సరసన ఆడిపాడింది. అందరితో చక్కని అనుబంధాన్ని కూడా మెయింటైన్ చేసింది. మొత్తానికి ఆమె కెరీర్ లో ఆమెకు అన్నీ బాగానే జరిగాయి.

    Also Read: Acharya: నైజాం ఫస్ట్ డే కలెక్షన్లలో ‘ఆచార్య’ ప్లేస్ ఎక్కడ ఉందంటే?

    అయితే ఎందుకో అంతా బాగానే ఉన్నా, ఆమె మాత్రం తనకు అలవాటు అయిన ఆ డ్రగ్స్ మత్తు నుండి బయటపడలేక పోయింది. ఇంత గొప్ప అందమైన అమ్మడికి అలాంటి అలవాటు ఏమిటి ? అంటూ తోటి సినీ ప్రముఖులు కూడా ఆశ్చర్యపోయారు. పైగా ఆమె తన అలవాటును పబ్లిక్ చేసేసుకుంది. మొదట్లో దీన్ని ఎవ్వరూ పట్టించుకోకపోయినా ఆ తర్వాత మాత్రం ఆమెను స్టార్ హీరోలు దూరం పెట్టారు.

    Star Heroine

    అప్పటికీ గానీ ఆమెకు తత్త్వం బోధపడలేదు. పాపులర్ హీరోయిన్ గా తనకు స్టార్ హీరోలతో మంచి పరిచయాలే ఉన్నాయి. ఫోన్ చేసి ఛాన్స్ లు అడిగినా ఆమెకు ఎవ్వరూ ఛాన్స్ ఇవ్వలేదు. కానీ తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ మళ్లీ కెరీర్ ను బిల్డ్ చేసుకునే క్రమంలో ఆమెకు వరుస ప్లాప్స్ వచ్చాయి.

    హిందీకి వెళ్ళింది. అక్కడ ఛాన్స్ లు రావడం లేదు. మళ్ళీ, ఆ హీరోయిన్ కి ఫ్రీ టైం దొరికింది. దాంతో ఆమె తన అలవాటును మళ్ళీ మొదలెట్టింది. పైగా తన ప్లాట్ లో తన తోటి నటీనటులకు కూడా పార్టీ పేరుతో మంచి కిక్ ను ఇస్తోందట. ఇది ఇలాగే కంటిన్యూ అయితే, ఇక ఆ హీరోయిన్ కెరీర్ పోయినట్టే. మత్తులో సర్వం కోల్పోతున్న ఆ హీరోయిన్ పేరు వెనుక సింగ్ ఉంటుంది. మరి ఆ హీరోయిన్ ఎవరో మీ కామెంట్స్ రూపంలో తెలపండి.

    Also Read:Chiranjeevi: ఆచార్యలో కన్పించని ‘చిరు’ మార్క్..!

    Recommended Videos:

    Tags