First Day Collections: మొదటి రోజు వసూళ్లలో ఎవరిదీ పై చెయ్యి..?

First Day Collections: కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత లాక్ డౌన్ ఎత్తివేసాక మన టాలీవుడ్ లో ఒక్కదాని తర్వాత ఒక్కటి స్టార్ హీరోల సినిమాలు అన్నీ వరుసగా విడుదల అయినా సంగతి మన అందరికి తెలిసిందే..వీటిల్లో కేవలం రాధే శ్యామ్ మూవీ మినహా మిగిలిన అన్ని సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్స్ గా నిలిచాయి..ఓపెనింగ్ రికార్డ్స్ కూడా నైజం ప్రాంతం నుండి అమెరికా వరుకు మన తెలుగు సినిమా మార్కెట్ కి […]

Written By: Neelambaram, Updated On : April 30, 2022 5:11 pm
Follow us on

First Day Collections: కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత లాక్ డౌన్ ఎత్తివేసాక మన టాలీవుడ్ లో ఒక్కదాని తర్వాత ఒక్కటి స్టార్ హీరోల సినిమాలు అన్నీ వరుసగా విడుదల అయినా సంగతి మన అందరికి తెలిసిందే..వీటిల్లో కేవలం రాధే శ్యామ్ మూవీ మినహా మిగిలిన అన్ని సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్స్ గా నిలిచాయి..ఓపెనింగ్ రికార్డ్స్ కూడా నైజం ప్రాంతం నుండి అమెరికా వరుకు మన తెలుగు సినిమా మార్కెట్ కి మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది అనే చెప్పాలి..అంతే కాకుండా మొదటి రోజు వసూళ్లు గురించి కూడా చాలా కాలం తర్వాత మళ్ళీ ట్రేడ్ వర్గాల్లో హాట్ హాట్ గా మాట్లాడుకునే రోజులు వచ్చేసాయి..ఇక నిన్ననే మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ఆచార్య సినిమా విడుదల అయినా సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమాకి మొదటి రోజు ఎంత వసూళ్లు వచ్చాయి..భీమ్లా నాయక్ , రాధే శ్యామ్ మరియు #RRR వంటి సినిమాల ఓపెనింగ్స్ తో పోలిస్తే ఆచార్య ఎలాంటి వసూళ్లు దక్కించుకుంది అనే దానిపై ఇప్పుడు మనం చూడబోతున్నాము.

First Day Collections

మెగా అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఆచార్య సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా సుమారు 2000 కి పైగా థియేటర్స్ లో విడుదల అయ్యింది..కానీ భారీ అంచనాలతో విడుదల అవ్వడం వల్ల ఈ సినిమా మొదటి ఆట నుండే ఆ అంచనాలను అందుకోవడం లో విఫలం అయ్యింది అనే చెప్పాలి.

Also Read: Acharya: నైజాం ఫస్ట్ డే కలెక్షన్లలో ‘ఆచార్య’ ప్లేస్ ఎక్కడ ఉందంటే?

టాక్ సరిగా లేకపోవడం వల్ల ఓపెనింగ్స్ మీద కాస్త ప్రభావం చూపించింది..కానీ చిరంజీవి మరియు రామ్ చరణ్ కాంబినేషన్ కావడం తో ఈ మూవీ కి డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ అవి మెగాస్టార్ రేంజ్ ఓపెనింగ్స్ కావు..ఇక ప్రాంతాల వారీగా ఈ సినిమా మొదటి రోజు వసూళ్ల విషయానికి వస్తే నైజం ఏరియా లో ఈ సినిమాకి దాదాపుగా మొదటి 7 కోట్ల 90 లక్షల రూపాయిలు షేర్ రాగా, సీడెడ్ లో 4 కోట్ల 60 లక్షలు, ఉత్తరాంధ్ర లో 3 కోట్ల 60 లక్షలు,ఈస్ట్ గోదావరి లో రెండు కోట్ల 53 లక్షలు , వెస్ట్ లో రెండు కోట్ల 90 లక్షలు , గుంటూరు లో 3 కోట్ల 76 లక్షలు, కృష్ణ జిల్లాలో ఒక్క కోటి 90 లక్షలు మరియు నెల్లూరు లో రెండు కోట్ల 30 లక్షల రూపాయిల షేర్స్ ని సాధించి మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఆల్ టైం టాప్ 2 ఓపెనింగ్ గా నిలిచింది..మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమా 30 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది.

acharya

ఆచార్య కి ముందు విడుదల అయినా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ , అల్లు అర్జున్ పుష్ప మరియు ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాల కంటే ఆచార్య ఎక్కువ వసూలు చేసింది అనే చెప్పాలి..కానీ ఆచార్య సినిమాకి ఉన్న అధిక టికెట్ రేట్స్ భీమ్లా నాయక్ మరియు పుష్ప వంటి సినిమాలకి లేవు..భీమ్లా నాయక్ సినిమాకి అతి తక్కువ టికెట్ రేట్స్ తో ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ కి కలిపి దాదాపుగా 27 కోట్ల రూపాయిల షేర్ వచ్చింది , ఆచార్య కి ఉన్నట్టుగా భీమ్లా నాయక్ కి కనీసం బెన్ఫిట్ షోస్ కూడా లేకపోవడం విశేషం..ఇక పుష్ప సినిమా కూడా ఇదే పరిస్థితులలో వచ్చి దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 25 కోట్ల రూపాయిల షేర్ వసూలు చేసింది..మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా భీమ్లా నాయక్ 38 కోట్ల రూపాయిల షేర్ వసూలు చెయ్యగా..KGF 28 కోట్లు , పుష్ప 34 కోట్లు మరియు ఆచార్య సినిమా 45 కోట్ల రూపాయిల వరుకు ఓపెనింగ్స్ ని దక్కించుకుంది.

Also Read: Star Heroine: స్టార్ హీరోయిన్ అందాల వల.. ఫిదా అవుతున్న నెటిజన్లు..!

Recommended Videos:

Tags