Athiya Shetty-KL Rahul : కేఎల్ రాహుల్ – అతియా శెట్టి మధ్య మొదట్లో స్నేహం మాత్రమే ఉండేది. అది కాస్త ప్రేమగా మారింది. వారిద్దరూ చాలా సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారు. గత ఏడాది ఆగస్టులో అతియా శెట్టి గర్భవతి అయింది. ఇటీవల పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని కేఎల్ రాహుల్ – అతియా శెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో తమకు ఆడపిల్ల పుట్టిందని పేర్కొన్నారు. ఆడపిల్ల పుట్టడంతో మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని వారిద్దరు అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని సునీల్ శెట్టి కూడా తన సామాజిక మాధ్యమ ఖాతాలలో పంచుకున్నారు. అతియా శెట్టి ప్రసవం నిమిత్తం ఆస్పత్రిలో చేరడంతో.. ఐపీఎల్ లో తొలి మ్యాచ్ కు కేఎల్ రాహుల్ దూరమయ్యాడు..
Also Read : అద్దెకు దిగిన వాళ్ళనే అత్తింటి వారిని చేసుకున్నాడు.. భువి లవ్ స్టోరీ సినిమాకు తీసిపోదు..
పుట్టినరోజు సందర్భంగా పేరు పెట్టారు
శుక్రవారం నాడు కేఎల్ రాహుల్ తన 33వ జన్మదినాన్ని జరుపుకుంటున్నాడు. ఈ క్రమంలో తన అభిమానులకు కేఎల్ రాహుల్ ఒక అద్భుతమైన కానుక ఇచ్చాడు. తన జన్మదినాన్ని పురస్కరించుకొని కేఎల్ రాహుల్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు. అతడి భార్య అతియా శెట్టి కూడా ఇదే విషయాన్ని పంచుకుంది. ఆ చిన్నారికి “ఇవారా విపుల రాహుల్” అని నామకరణం చేశామని కేఎల్ రాహుల్, అతియా శెట్టి తమ సామాజిక మాధ్యమాల ఖాతాల ద్వారా వెల్లడించారు. అంతేకాదు తమ కూతురు అందమైన ఫోటోలు అందులో పోస్ట్ చేశారు..
ఆ పేరుకు అర్థం ఏంటంటే
“ఇవారా” అటే భగవంతుడు ఇచ్చిన బహుమతి అని..”విపుల” అంటే రక్షించేవాడని.. ఇక చివరిలో ఉన్న రాహుల్ అనేది తన తండ్రి పేరు అని అతియా శెట్టి సోషల్ మీడియాలో వ్యాఖ్యానించింది.. తమ కూతురు పేరు బయటకు వెల్లడించడంతో సోషల్ మీడియాలో అతియా శెట్టి – కేఎల్ రాహుల్ దంపతులకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.. మార్చి 24న అతియా శెట్టి పండంటి పాపకు జన్మనిచ్చింది..అతియా శెట్టి ఆడపిల్లకు జన్మనివ్వడంతో..అతియా శెట్టి తండ్రి సునీల్ శెట్టి హర్షం వ్యక్తం చేశాడు. అంతేకాదు తనకు మనవరాలు పుట్టడం వల్ల ఒకసారిగా జీవితం మారిపోయిందని పేర్కొన్నాడు. కాగా, అతియా శెట్టి – కేఎల్ రాహుల్ 2023, జనవరి 23న వివాహం చేసుకున్నారు. ఈ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత సినీ ప్రముఖులకు, క్రికెట్ ప్రముఖులకు సునీల్ శెట్టి, కేల్ రాహుల్ వేరువేరుగా వివాహ విందులు ఇచ్చారు. వివాహం తర్వాత తన కూతురికి సునీల్ శెట్టి విలువైన కానుకలు ఇచ్చాడు. అంతేకాదు భూములు, భారీ భవనాలు ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు.