Death Signs: అష్టాదశ పురాణాల్లో శివపురాణం ఒకటి. ఇందులో శివుని విధులు, అవతారాలు, ఆశీర్వాదాలు సహా ప్రతిదాని గురించి స్పష్టమైన వివరణ ఉంటుంది. ఒక వ్యక్తి పుట్టిన నుంచి గిట్టే వరకు జరిగే చర్చల గురించి కూడా ఉంటుంది. ఇందులో ఒక వ్యక్తి మరణించే ముందు వచ్చే మార్పులు, సూచనలను కూడా వివరిస్తుంది. శివ పురాణం ప్రకారం.. చనిపోయే ముందు ఎలాంటి సూచనలు వస్తాయో తెలుసుకుందాం..
ఒక వ్యక్తి సూర్యుడు, చంద్రుని రూపాలను స్పష్టంగా చూడలేకపోయినా.. చుట్టూ నలుపు లేదా ఎరుపు రంగులో మెరుస్తున్న సర్కిల్ కనిపించినా మృత్యువుకు దగ్గర అవుతున్నట్టు. శివ పురాణం ప్రకారం త్వరలోనే మరణం సంభవిస్తుందని సకేంతాలు వచ్చినట్టుగా చెబుతుంటారు. ఒక వ్యక్తి ఎడమ చేయి మెలితిరగడం లేదా నోరు పైభాగం ఎండిపోవడం వంటివి జరుగుతున్నా.. వారు చనిపోవడానికి సంకేతం వచ్చినట్టు అని శివ పురాణం తెలుపుతుంది.
ఇలాంటి వ్యక్తికి మరణం చెందే సమయం అతి దగ్గరలో ఉందని భావించవచ్చట. అతి త్వరలో వీరికి మరణం సంభవిస్తుందట. కొన్ని నెలల్లో మరణం సమీపించే అవకాశం ఉంటే.. ఆ వ్యక్తి పంచేంద్రియాలు క్రమంగా పనితీరును కోల్పోతాయని తెలుపుతుంది శివ పురాణం. అంటే మానవుని పంచేంద్రియాల పనితీరు తగ్గినట్టు కనిపిస్తే.. మృత్యువు దగ్గరలో ఉందని అర్థం చేసుకోవచ్చని తెలుపుతుంది శివ పురాణం.
ఒక వ్యక్తి శరీరం మొత్తం తెల్లగా మారి దానిపై పసుపు లేదా ఎరుపు మచ్చలు కనిపించడం ప్రారంభిస్తే మరణానికి దగ్గర అవుతున్నట్టు భావించాలని.. అద్దం, నెయ్యి, నీరు లేదా నూనెలో ప్రతిబింబాన్ని చూడలేకపోయినా మరణం సమీపంలోనే ఉందని భావించవచ్చు అని తెలుపుతుంది శివపురాణం.