Star Heroes: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ప్లాపుల్లో కొనసాగుతున్నారు. కొంతమంది హీరోలు మంచి విజయాలను అందుకుంటుంటే చాలామంది హీరోలు మాత్రం వాళ్ల కెరియర్ ను నెట్టుకొస్తున్నారు..ఇక కొంతమంది హీరోలకి కనక ఇప్పుడు సాలిడ్ హిట్ పడకపోతే వాళ్ల సినిమా కెరియర్ అనేది ఆల్మోస్ట్ డౌన్ అయిపోతుందనే చెప్పాలి. అందులో ఎవరెవరు ఉన్నారు అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం…
విక్టరీ వెంకటేష్(Venkatesh)
ఈయన చేస్తున్న సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. తమిళం నుంచి ‘అసురన్’ అనే సినిమాను ‘నారప్ప ‘ పేరుతో రీమేక్ చేసిన వెంకటేష్ ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ అది ఓటిటి లో రిలీజ్ అయింది. దానివల్ల ఆయన కెరియర్ కి పెద్దగా ఒరిగిందైతే ఏమి లేదు. అలాగే మలయాళ ఇండస్ట్రీ నుంచి దృశ్యం 2 ను రీమేక్ చేసిన వెంకటేష్ ఈ సినిమా కూడా ఓటిటి లో రిలీజ్ అవ్వడం వల్ల దీని సక్సెస్ ని ఆయన పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయాడు. ఇక రీసెంట్ గా వచ్చిన సైంధవ్ సినిమా భారీ డిజాస్టర్ గా మిగలడం తో ఆయన కెరీయర్ అనేది ప్రస్తుతానికి డైలమాలో పడిపోయింది…
నాగార్జున(NagarjunaNagarjuna, Venkatesh, Gopichand, Sandeep Kishan, Movie News,)
ప్రస్తుతం నాగార్జున వరుస ఫ్లాపులతో ఇండస్ట్రీలో తన కెరియర్ ను రోజు రోజుకి డౌన్ చేసుకుంటూ వస్తున్నాడు. ‘సోగ్గాడే చిన్నినాయన ‘ సినిమా తర్వాత ఆయనకి ఒక్క సూపర్ హిట్ కూడా దక్కలేదు. ఇక ఆ సినిమాతో అప్పట్లో ఆయన భారీ కలెక్షన్లు రాబట్టాడు. ఇక రీసెంట్ గా వచ్చిన నా సామి రంగ సినిమాతో భారీ ప్లాప్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడూ ఈయన హీరోగా మరికొన్ని సంవత్సరాలపాటు కొనసాగాలంటే అర్జెంటుగా నాగార్జునకి ఒకటి రెండు భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే పడాలి. అవి లేకపోతే మాత్రం నాగార్జున మార్కెట్ అనేది పూర్తిగా డౌన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి…
ఇక ఈ విషయానికి వస్తే గోపిచంద్ కి కూడా భీమా సినిమా తో ఒక సక్సెస్ అయితే కొట్టాలి. లేకపోతే ఈయన మార్కెట్ కూడా డౌన్ అయ్యే పొజిషన్ కి వచ్చింది… ఇక సందీప్ కిషన్ కి ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే పడాలి. ఇక రీసెంట్ గా వచ్చిన ఊరి పేరు భైరవకోన సినిమా యావరేజ్ గా ఆడింది. అయితే ఇప్పుడు కనక వీళ్ళకి ఒక భారీ సక్సెస్ పడకపోతే ఈయన పరిస్థితి కూడా ఫేడ్ ఔట్ దశకు వచ్చేస్తుంది…