Homeఎంటర్టైన్మెంట్Venu Swamy: వేణు స్వామి అరెస్ట్? రంగంలోకి నాగార్జున, ఆ ఛాన్స్ కూడా మిస్!

Venu Swamy: వేణు స్వామి అరెస్ట్? రంగంలోకి నాగార్జున, ఆ ఛాన్స్ కూడా మిస్!

Venu Swamy: ప్రముఖుల జాతకాలు ఓపెన్ గా చెబుతూ వేణు స్వామి పాప్యులర్ అయ్యారు. వేణు స్వామి చెప్పే జాతకాలు దాదాపు ప్రతికూల స్వభావం కలిగి ఉంటాయి. ఎవరైనా హీరో, హీరోయిన్ పెళ్లి చేసుకుంటే చాలు, వెంటనే దిగిపోతాడు. వాళ్ళ జాతకరీత్యా కలిసి ఉండలేరు. విడిపోతారంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తాడు. గతంలో నాగ చైతన్య-సమంత విడిపోతారని వేణు స్వామి చెప్పాడు. కొన్నేళ్ళకు అది నిజమైంది. అప్పటి నుండి వేణు స్వామి ఆగడాలు మరింత పెరిగాయి.

పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి స్టార్స్ పై వేణు స్వామి పలుమార్లు ప్రతికూల వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా ఆయన ప్రభాస్ ని టార్గెట్ చేశాడు. ఆయనకు పెళ్లి యోగం లేదు. అనారోగ్య సమస్యలు ఉన్నాయి. బాహుబలి 2 తర్వాత హిట్ పడదు అంటూ ఫ్యాన్స్ ని హర్ట్ చేశాడు. దాంతో వారు వేణు స్వామిని ట్రోల్ చేశారు. మీరు బాధపడినా నేను ఉన్నదే చెబుతున్నానని వేణు స్వామి తనని తాను సమర్థించుకున్నారు.

కాగా ఆగస్టు 8న నాగ చైతన్య-శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం జరుపుకున్నారు. వెంటనే వేణు స్వామి తెరపైకి వచ్చాడు. నాగ చైతన్య, శోభితల జాతకాలు విశ్లేషిస్తూ ఓ వీడియో చేశాడు. యధావిధిగా నెగిటివ్ కామెంట్స్ చేశాడు. వీరిద్దరి జాతకాలరీత్యా కలకాలం కలిసి ఉండే ఛాన్స్ లేదు. 2027 లోపే విడిపోతారు. ఒక స్త్రీ వలన మనస్పర్థలు వస్తాయి. అసలు నాగ చైతన్యకు తండ్రి అయ్యే ఛాన్స్ లేదని అనుచిత కామెంట్స్ చేశాడు.

వేణు స్వామి ఆగడాలు శృతి మించుతున్న నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కాల్ చేశాడట. మంచు విష్ణు వేణు స్వామిని మందలించినట్లు తెలుస్తుంది. ఇకపై నేను టాలీవుడ్ ప్రముఖుల జాతకాలు విశ్లేషించను. వీడియోలు చేయను అని తెలియజేశాడు. గతంలో కూడా వేణు స్వామి ఇలానే మాటిచ్చాడు. కానీ మాట మీద నిలబడలేదు.

కాగా వేణు స్వామి మీద తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్, మీడియా యూనియన్స్ మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మహిళా కమిషన్ వేణు స్వామికి నోటీసులు పంపింది. ఆగస్టు 22న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. వేణు స్వామి అరెస్ట్ అయ్యే అవకాశం కూడా కలదని అంటున్నారు. మరోవైపు నాగార్జున వేణు స్వామి మీద కోపంగా ఉన్నాడట. వేణు స్వామి తన అనుచిత కామెంట్స్ కారణంగా బిగ్ బాస్ షోలో పాల్గొనే ఛాన్స్ కోల్పోయాడని అంటున్నారు.

వేణు స్వామి ఇటీవల కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అధినేతలకు గ్రాండ్ పార్టీ ఇచ్చాడట. అలాగే డబ్బులు ముట్టజెప్పాడట. బిగ్ బాస్ షోకి తాను ఎంపికైన నేపథ్యంలో ప్రమోట్ చేయాలని వాళ్లకు చెప్పాడట. అయితే నాగార్జున వేణు స్వామి ఆశలు గల్లంతు చేశాడట. వేణు స్వామిని బిగ్ బాస్ షోకి తీసుకోవద్దని సూచించాడట. అనూహ్యంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో పాల్గొనే ఛాన్స్ వేణు స్వామి కోల్పోయాడని టాక్. మున్ముందు వేణు స్వామికి తిప్పలు తప్పవనే మాట వినిపిస్తోంది.

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version