దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం యుగాంతం అంటూ వార్తలు వచ్చాయి. కొందరు ఆధారాలతో సహా యుగాంతం జరగబోతుందని వెల్లడించారు. అయితే అందరూ అనుకున్నట్టు అలా ఏం జరగలేదు. ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో యుగాంతం గురించి వార్తలు వచ్చినా ప్రజలు ఆ వార్తలను నమ్మడం, పట్టించుకోవడం మానేశారు. అయితే 2020 సంవత్సరంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే ప్రజలు యుగాంతం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కామెంట్లు చేస్తున్నారు.
Also Read : పెళ్లైన పది రోజులకే భర్తను వదిలేసిన భార్య.. చివరకు..?
దేశంలో ఇప్పటికే కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. చైనాలో నమోదైన కేసుల మొత్తం భారత్ లో ఒక్కరోజే నమోదవుతూ ఉండటం గమనార్హం. అయితే దేశంలో ఇలాంటి విపత్కర పరిస్థితులు చోటు చేసుకుంటున తరుణంలో వెలుగులోకి వస్తున్న కొత్త వార్తలు ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా వాషింగ్టన్ శాస్త్రవేత్తలు భారీ గ్రహ శకలం ఒకటి భూమి దారిలో ఉన్నట్లు గుర్తించారు.
కొందరు శాస్త్రవేత్తలు ఈ గ్రహశకలం వల్ల ప్రమాదమని చెబుతుంటే మరి కొందరు మాత్రం ఈ గ్రహశకలం అంత ప్రమాదకరం కాదని తెలుపుతున్నారు. భూమికి 13వేల మైళ్ల లోతులో ప్రయాణించే ఈ గ్రహశకలం చాలా తక్కువ లోతులో ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భూమికి అత్యంత సమీపంగా ఆగ్నేయ పసిఫిక్ మహాసముద్రం ప్రాంతంలో ఈ గ్రహశకలం వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
4.5 మీటర్ల నుండి 9 మీటర్ల పరిమాణం ఉన్న ఈ గ్రహశకలాన్ని చిన్న గ్రహశకలంగానే భావిస్తున్నామని.. ఇలాంటి గ్రహశకలాలు భూమిని తాకడం సర్వసాధారణమని తెలుపుతున్నారు. జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీకి చెందిన ప్రొఫెసర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఒక గ్రహశకలం ఖచ్చితంగా కాలిపోతుందని.. ఇప్పుడు భూమిని సమీపించిన గ్రహశకలం మరో 20 సంవత్సరాల తర్వాత భూమిని మరోసారి సమీపిస్తుందని తెలిపారు.
Also Read : తండ్రిని చంపిన వ్యక్తి కోసం 17 ఏళ్లుగా వెతుకుతున్న కొడుకు.. చివరకు..?