
Adipurush- Artist Pratik Sanghar: ఆదిపురుష్ మూవీ ఏ సమయాన మొదలుపెట్టారో కానీ అన్నీ వివాదాలే. తాజాగా ప్రతీక్ సంఘర్ అనే కాన్సెప్ట్ ఆర్టిస్ట్ ఆదిపురుష్ టీం పై దారుణ ఆరోపణలు చేశాడు. తన ఆర్ట్ వర్క్ కాపీ చేశారన్న ఆయన ఆదిపురుష్ టీం కి సినిమా మీద ఎలాంటి అభిరుచి లేదు. ఛీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. అందుకే ప్రాజెక్ట్ ఫెయిల్ అంటూ మండిపడ్డారు. ఆధారాలతో సహా ఓ స్టేట్మెంట్ విడుదల చేశారు. ఆదిపురుష్ మూవీలో రాముడిగా ప్రభాస్ లుక్ తన ఆర్ట్ వర్క్ లో భాగమని ప్రతీక్ సంఘర్ ప్రధాన ఆరోపణ.
ప్రతీక్ సంఘర్ తన సందేశంలో… నేను ఇండియన్ కాన్సెప్ట్ ఆర్టిస్ట్. నేను రాముని రూపాన్ని వర్ణిస్తూ అనేక ఆర్ట్స్ డెవలప్ చేశాను. ఆదిపురుష్ టీమ్ నా ఆర్టిస్టిక్ వర్క్ దొంగతనం చేశారు. నా అనుమతి లేకుండా, ఎలాంటి రెమ్యూనరేషన్ చెల్లించకుండా వాడుకున్నారు. ఆదిపురుష్ చిత్ర వైఫల్యానికి ఇది కూడా కారణం. ఈ చిత్రం తెరకెక్కిస్తున్న వాళ్లకు ఎలాంటి అభిరుచి లేదు. కేవలం ఛీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. నేను నా ఒరిజినల్ ఆర్ట్ వర్క్ కి సంబంధించిన ఆధారాలు మీ ముందు పెడుతున్నాను. అలాగే నా వర్క్ స్క్రీన్ షాట్స్ నేను తీసుకున్నాను. లేదంటే డౌన్ లోడ్ చేసుకుని తమవి అని చెప్పే ప్రమాదం ఉంది… అంటూ విమర్శలు గుప్పించారు.

ఆదిపురుష్ చిత్రానికి విజువల్ డిజైనర్ గా పని చేస్తున్న టీపీ. విజయన్ తన ఆర్ట్ వర్క్ దొంగిలించాడని ప్రతీక్ సంఘర్ ఆరోపిస్తున్నారు. ఇక ఈ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి. ఇప్పటికే ఆదిపురుష్ చిత్రాన్ని పలు వివాదాలు చుట్టుముట్టాయి. హనుమంతుడు, రావణాసురుడు గెటప్స్ మీద హిందూ సంఘాలు మండిపడ్డాయి. ఆదిపురుష్ టీజర్ పై అభిమానులు పెదవి విరిచారు.
శివ భక్తుడైన రావణాసురుడిని ఇష్టం వచ్చినట్లు చూపిస్తారా? అసలు ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ కి రామాయణం గురించి కనీసం తెలుసా? అంటూ ఏకిపారేశారు. ఆదిపురుష్ టీజర్ విమర్శల పాలైన నేపథ్యంలో ఆరు నెలలు మూవీ వాయిదా పడింది. 2023 సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన ఈ చిత్రం జూన్ 16కి వాయిదా వేశారు. మరో వంద కోట్లు కేటాయించి మెరుగులు దిద్దుతున్నారని సమాచారం. ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ జానకిగా నటిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడు పాత్ర చేస్తున్నారు.