
Shriya Saran Baby Bump: హీరోయిన్ శ్రియ శరన్ షాకింగ్ ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాను ఊపేస్తోంది. దానికి ఓ ప్రధాన కారణం ఉంది. శ్రియ శరన్ రష్యాకు చెందిన ఆండ్రీ కోస్చీవ్ తో చాలా కాలం డేటింగ్ చేశారు. 2018 మార్చ్ 19న వీరికి వివాహం జరిగింది. పెళ్ళైన రెండేళ్లకు శ్రియ గర్భం దాల్చారు. 2021 జనవరిలో ఒక ఆడపిల్లలకు జన్మనిచ్చారు. ఇదంతా రహస్యంగా జరిగింది. తాను గర్భవతి అయిన విషయం శ్రియ శరన్ దాచిపెట్టారు. సడన్ గా ఓ రోజు మీడియా సమావేశంలో ఈ విషయాన్ని బయటపెట్టారు. శ్రియకు కూతురు ఉందన్న విషయం తెలిసి అందరూ షాక్ అయ్యారు.
ప్రెగ్నెన్సీ గురించి ఎందుకు దాచాల్సి వచ్చిందో శ్రియ వివరణ ఇచ్చారు. కొన్ని అవమానాలకు భయపడే తన ప్రెగ్నెన్సీ మేటర్ రహస్యంగా ఉంచాను అన్నారు. ప్రెగ్నెన్సీ, డెలివరీ వలన నా శరీరంలో మార్పులు చోటు చేసుకుంటాయి. నేను బాడీ షేమింగ్ కి గురయ్యే అవకాశం ఉంది. ఆ విమర్శలకు భయపడి గర్భం దాల్చిన విషయం బయట పెట్టలేదన్నారు. శ్రియ తల్లైన సమయంలో లాక్ డౌన్ నడుస్తుంది. ఎలాంటి షూటింగ్ లేవు. ఇది ఆమెకు కలిసొచ్చింది.

శ్రియ బయటకు రావాల్సిన అవసరం లేకపోవడంతో ఆమె ప్రెగ్నెన్సీ మేటర్ రహస్యంగా ఉండిపోయింది. కాగా అప్పటి తన బేబీ బంప్ ఫోటోను ఫస్ట్ టైం శ్రియ సోషల్ మీడియాలో పెట్టారు. అభిమానులతో పంచుకున్నారు. నిండు గర్భవతి గా ఉన్న శ్రియ శరన్ ఫోటో వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.

మరోవైపు శ్రియ నటిగా ఫుల్ బిజీ. పరిశ్రమలో రెండు దశాబ్దాల ప్రస్థానం పూర్తి చేసుకున్న శ్రియకు ఇంకా హీరోయిన్ ఛాన్సులు రావడం విశేషం. లేటెస్ట్ మూవీ కబ్జలో శ్రియ హీరోయిన్ గా నటించారు. అజయ్ దేవ్ గణ్ కి జంటగా నటించిన దృశ్యం 2(హిందీ) హిట్ టాక్ తెచ్చుకుంది. ఆర్ ఆర్ ఆర్ వంటి భారీ చిత్రంలో ఓ చిన్న పాత్ర చేశారు. రాజమౌళితో గతంలో శ్రియ ఛత్రపతి చిత్రం చేశారు. ప్రస్తుతం మ్యూజిక్ స్కూల్ టైటిల్ తో ఓ మూవీలో శ్రియ నటిస్తున్నారు. టాలీవడ్ లో రెండు తరాల స్టార్స్ తో నటించిన ఘనత శ్రియ సొంతం.