
Anchor Rashmi Gautam Wedding: యాంకర్ రష్మీ గౌతమ్ కి పెళ్లీడు వచ్చి చాలా కాలం అవుతుంది. ఆమె ప్రస్తుతం థర్టీ ప్లస్ లో ఉన్నారు. చెప్పాలంటే ఆమెకు ఏజ్ బార్ అయినట్లే లెక్క. కాకపోతే గ్లామర్ ఫీల్డ్ లో ఉన్న అమ్మాయిలు పెళ్లికి ససేమిరా ఒప్పుకోరు. ఫార్మ్ లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటే కెరీర్ మటాష్ అవుతుందని భయపడతారు. కారణం ఏదైనా రష్మీ పెళ్లి చేసుకోవడం లేదు. ఈ క్రమంలో అనే పుకార్లు తెరపైకి వస్తున్నాయి.
అయితే ఎట్టకేలకు రష్మీ పెళ్ళికి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఆమెకు కాబోయేవాడిని నిర్ణయించేందుకు ఏకంగా స్వయంవరం ఏర్పాటు చేశారు. రష్మీని వివాహం ఆడేందుకు వచ్చిన హ్యాండ్సమ్ బాయ్స్ నుండి నచ్చిన వాడిని తనే ఎంచుకోవచ్చన్న మాట. రష్మీ స్వయంవరం ఎక్కడ? ఎప్పుడు? అనే కదా మీ సందేహం. దానికి శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికైంది. ఈ ఎంటర్టైన్మెంట్ షోలో రష్మీకి స్వయంవరం ఏర్పాటు చేశారు.
ఇది రియల్ స్వయంవరం కాదులెండి. కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం చేసిన ఏర్పాటన్న మాట. శ్రీదేవి డ్రామా కంపెనీ జడ్జి ఇంద్రజ రష్మీ స్వయంవరం నిర్వహించారు. పలువురు బుల్లితెర సెలెబ్రిటీలు ఆమెను పెళ్లాడేందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో నెక్స్ట్ ఎపిసోడ్ పై ఆసక్తి పెంచేసింది. కాగా పలుమార్లు రష్మీ బుల్లితెర షోలలో పెళ్లి కూతురు అయ్యింది. ఢీ షో వేదికగా సుడిగాలి సుధీర్ కి ఇచ్చి పెళ్లి చేశారు. ఒకటి రెండు సార్లు సుధీర్-రష్మీ ఉత్తుత్తి పెళ్లి చేసుకున్నారు.

మరోవైపు రష్మీ సింగిలా లేక రిలేషన్షిప్ లో ఉన్నారా? అనే సందేహాలు కొనసాగుతున్నాయి. సుడిగాలి సుధీర్ ఆమె లవర్ అనే ప్రచారం ఉంది. అయితే మేము స్నేహితులం మాత్రమే అని సుధీర్, రష్మీ చెబుతుంటారు. ఇక యాంకర్ గా ఆమె కెరీర్ సక్సెస్ ఫుల్ ట్రాక్ లో దూసుకెళుతుంది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ప్రజాదరణ పొందిన షోలలో యాంకర్ గా ఉన్నారు. హీరోయిన్ గా మాత్రం ఆమె ఫెయిల్ అయ్యారు. ఒకప్పుడు హీరోయిన్ గా వరుస ఆఫర్స్ అందుకున్న రష్మీ… నెమ్మదించారు. రష్మీ హీరోయిన్ గా నటించిన చివరి చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్. గత ఏడాది విడుదలైంది.