Africa Gold Mines: అప్పనంగా వచ్చే దాని కోసం అర్రులు చాస్తున్నారు. సులువుగా డబ్బు సంపాదించాలనే యావలో అడ్డదారులు తొక్కుతున్నారు. నిత్యం ఏదో ఒక చోట తమకు డబ్బు కావాలనే ఉద్దేశంతో ఎలాంటి పనులు చేయడానికైనా వెనకాడరు. చట్టబద్ధమైనా చట్ట వ్యతిరేకమైనా చేసేందుకు వెనకాడటం లేదు. కష్టమైనా ఏదో డబ్బులు కావాలనే లక్ష్యంతోనే ఎంతటి త్యాగానికైనా సిద్ధమవుతున్నారు. సులభంగా వస్తే ఇక కష్టపడే అవసరం ఉండదని అర్థం చేసుకుని ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
ఆఫ్రికా దేశంలోని చాద్ లో ఓ ప్రమాదం చోటుచేసుకుంది. రంగు రాళ్లు ఏరుకునే ముఠాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో రెండు వర్గాల మధ్య జరిగిన గొడవలో దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనలో వంద మంది చనిపోయారు. నలభై మంది గాయపడ్డారు. లిబియా నది సరిహద్దులోని కౌరీ బౌగౌడీ ప్రాంతంలో ఈ ఘర్షణలు జరిగాయి. దీంతో గొడవలను కట్టడి చేసేందుకు అక్కడి వారు ఎంత ప్రయత్నించినా ఫలితం కానరాలేదు.
Also Read: Mahesh Babu And Namrata: కృష్ణకి.. మహేష్, నమ్రతా ఎలా ‘బర్త్ డే విషెస్’ చెప్పారో చూడండి !
గొడవలు సర్దుమణిగేలా చేసేందుక అక్కడి సైన్యం రంగంలోకి దిగింది. ఘర్షణకు కారకులైన వారిపై చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించింది. కొన్నాళ్లుగా బంగారు గనుల్లో బంగారం కోసం అక్రమంగా తవ్వుతున్న ముఠాలు కొన్ని సంచరిస్తున్నాయి. వాటి మధ్య ఉన్న తగాదాల కారణంగా రక్తపాతం జరిగింది. రెండు గ్రూపుల మధ్య జరిగిన దారుణంతో రక్తం ఏరులై పారింది. ఈ నేపథ్యంలో గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నా జాగ్రత్తలు తీసుకోవడం లేదు.
బంగారం కావాలనే ఆశతో ఎంతటి దారుణానికి కూడా బెదరడం లేదు. గ్రూపు తగాదాలతో గొడవలకు ఆజ్యం పోస్తూనే ఉన్నారు. అయినా పాలకుల్లో కూడా చిత్తశుద్ది కనిపించడం లేదు. దారుణాలను జరగకుండా ఆపాల్సిన వారే వాటిని ప్రోత్సహిస్తున్నట్లుగా కనిపిస్తోంది. దీంతోనే తరచుగా ఇక్కడ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. దీంతోనే మనుషుల విలువైన ప్రాణాలు పోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకుని గొడవలు లేని విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Also Read:R S Praveen Kumar- Akunuri Murali: ఆరెస్పె.. ఆకునూరితో మార్పు సాధ్యమేనా? వారు ప్రయత్నం పలించేనా!?