Waltair Veerayya: భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే..వరుస ఫ్లాప్స్ లో ఉన్న మెగాస్టార్ చిరంజీవికి మరియు ఆయన అభిమానులకు ఈ సినిమా ఇచ్చిన కిక్ మామూలుది కాదు..ఈ సినిమాని తొక్కేయాలని పచ్చ మీడియా విడుదల రోజు తెల్లవారుజాము నుండే బ్యాడ్ రివ్యూస్ ఇస్తూ నెగటివ్ టాక్ ని బాగా ప్రచారం చేసింది.

కానీ మెగాస్టార్ స్టార్ స్టేటస్ ముందు ఆ నెగటివ్ రివ్యూస్ అన్నీ గాలిలో కొట్టుకుపోయాయి..వారం రోజుల్లోనే వంద కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టి స్టార్ హీరోలకు కూడా సాధ్యపడని సరికొత్త రికార్డుని నెలకొల్పాడు మెగాస్టార్ చిరంజీవి..67 ఏళ్ళ వయస్సు లో కూడా చెక్కు చెదరని స్టార్ ఇమేజి ని మైంటైన్ చేస్తున్న ఏకైక ఇండియన్ హీరో ఒక్క మెగాస్టార్ చిరంజీవి మాత్రమే అని చెప్పొచ్చు.
అయితే మెగాస్టార్ చిరంజీవి ఇంత పెద్ద సక్సెస్ సాధించిన తర్వాత కూడా టాలీవుడ్ సెలబ్రిటీస్ నుండి ‘శుభాకాంక్షలు’ తెలియచేస్తునట్టు ఒక్క ట్వీట్ కానీ , పోస్టు కానీ కనపడకపోవడం బాధాకరం..టాలీవుడ్ లో ఏ హీరో హిట్ కొట్టినా మనస్ఫూర్తిగా శుభాకంక్షాలు తెలియచెయ్యడం మెగాస్టార్ కి అలవాటు..చిన్న ఆర్టిస్టుల దగ్గర నుండి పెద్ద ఆర్టిస్టుల వరకు ఆయన చూపించే వాత్సల్యం వెలకట్టలేనిది.

ఎవరైనా హిట్టు కొడితే తన కుటుంబం నుండి వచ్చిన హీరో హిట్ కొట్టినంత అనంతపడే మనస్తత్వం ఉన్న చిరంజీవి, నేడు ఇండస్ట్రీ ని షేక్ చేసే రేంజ్ హిట్ కొట్టినా కూడా ఒక్క సెలెబ్రిటీ కూడా పట్టించుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంటూ మెగా అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు..ఇది ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారా..లేదా సహజం గానే చెయ్యలేదా అంటూ టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరినీ ట్యాగ్ చేసి అడుగుతున్నారు మెగా ఫ్యాన్స్.