China- Cricket: అభిమానులు ఎక్కువగా ఇష్టపడేది క్రికెట్, సినిమాలు రెండింటినే. ఇందులో క్రికెట్ నే ఎక్కువగా ఫాలో అవుతుంటారు. మ్యాచ్ ఉందంటే ఆ రోజు స్కూలైనా, కాలేజైనా సెలవు పెట్టాల్సిందే. మ్యాచ్ ను ఎంజాయ్ చేయాల్సిందే. బ్యాటింగును ఆస్వాదించాల్సిందే. లేదంటే వారికి మనసు కుదుట పడదు. అందుకే క్రికెట్ అంటే ఓ వ్యసనంలా మారిపోయింది. ప్రతి వాడికి ఓ పిచ్చిలా అయిపోయింది. అందుకే క్రికెట్ అంటే దాని గురించి అనర్గళంగా మాట్లాడతారు. జాతీయ సమైక్యత భావం కేవలం క్రికెట్ లోనే ఉందన్న ఫీలింగ్ అందరిలో ఉండటం గమనార్హం.

ఇంతలా వ్యాపించిన క్రికెట్ ఆటకు చైనా ఎందుకు ముందుకు రాదు అంటే దానికి ఓ రెండు కారణాలు ఉన్నాయి. దాని వర్షన్ దానికి ఉంది. చైనా ఒలింపిక్స్ క్రీడల్లో అత్యధిక పతకాలు సాధిస్తున్న దేశం. క్రికెట్ ఒలింపిక్స్ లో లేని ఆట కావడంతో దాని వైపు ఎక్కువగా దృష్టి సారించదు. దీంతో చైనాకు కూడా క్రికెట్ టీం ఉంది. కానీ వారు ఏ వేదికల మీద పోటీకి ఎక్కువగా దిగరు. పైగా క్రికెట్ ఆడే దేశాలన్ని ఇంగ్లండ్ పాలనలో మగ్గినవే కావడం ఇక్కడ మరో కారణం. చైనా ఎప్పుడు కూడా ఇంగ్లండ్ వారికి తలొగ్గలేదు. దీంతోనే వారు క్రికెట్ ను ఎక్కువగా ఇష్టపడరనే తెలుస్తోంది.
Also Read: MLA Komatireddy Rajgopal Reddy: అమిత్ షా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్యలో నిషికాంత్ దూబే
2009 ఐసీసీ ట్రోఫీ చాలెంజ్ లో చైనా పాల్గొంది. మొదటి మ్యాచ్ లో ఓటమి పాలైంది. తరువాత మయన్మార్ తో జరిగిన మ్యాచ్ లో మొదటి ఇంటర్నేషనల్ విజయం నమోదు చేసింది. చైనాలో కూడా క్రికెట్ ను ప్రమోట్ చేస్తున్నా ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. 2019లో జరిగిన టీ20 ఉమెన్స్ ఈస్ట్ ఏషియా కప్ టోర్నమెంట్ లో చైనా విజయం సాధించింది. అడపాదడపా ఆడుతున్నా క్రికెట్ పై పూర్తిస్థాయిలో దృష్టి సారించడం లేదు. ఏదో నామ్ కే వాస్తేగా క్రికెట్ ను బలమైన ఆటగా గుర్తించడం లేదని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో చైనావాసుల కల ఒలింపిక్స్ లో స్వర్ణ పతకాలు సాధించడంపైనే గురి ఉంటుంది. కానీ ఇతర ఆటల జోలికి వెళ్లరు. క్రికెట్ అంటే మొత్తానికి వారికి నచ్చదు. అందుకే మొక్కుబడిగా ఆడతారు తప్ప ఆసక్తితో మాత్రం కాదు. అందుకే వారు క్రికెట్లో ఇంకా ఆరితేరలేదు. క్రికెట్ ను ఎక్కువగా ఇష్టపడితేనే దానిపై పట్టు సాధిస్తాం. అంతే కాని ఏదో తూతూ మంత్రంగా ఆడితే అంతే సంగతి. దీంతో క్రికెట్ కు చైనా ఇప్పట్లో ప్రాధాన్యం ఇచ్చేలా కనిపించడం లేదు. ఫలితంగా వారు పోటీల్లో కూడా ముందుకు రావడం కరువే. దీంతో క్రికెట్ అంటే చైనా వాసులకు ఇష్టం లేని క్రీడగా గుర్తింపు పొందింది.
Also Read:68th National Film Awards: జాతీయ అవార్డుల విజేతలు వీరే.. సత్తా చాటిన తెలుగు సినిమాలు