https://oktelugu.com/

తాజా సర్వే : ఆడవాళ్లు ఆరోగ్యానికి హానికరమా.. ప్రయోజనమా.?

అప్పటివరకు బ్యాచ్ లర్ గా ఇష్టమైన జీవితం గడిపిన వారు పెళ్లి కాగానే బందీ అయిపోయినట్టు ఫీలవుతారు.. పెళ్లి చేసుకుంటే రాత్రి ఠంచనుగా ఇంటికి రావాలి.. పెళ్లాం, పిల్లల్ని చూసుకోవాలి.. బయట ఆఫీసులో గొడ్డి చాకిరీ చేసి సంపాదించి కుటుంబాన్ని పోషించాలి. లేకపోతే ఆ మగాడికి.. ఆ మొగుడికి విలువ లేదంటారా ఆడవాళ్లు.. ఇక సంసారం గురించి.. భార్య బాధితుల గురించి ఎన్నో సినిమాలు, సీరియల్లు, కామెడీ షోల్లో వివరిస్తూనే ఉంటారు. ఇంతకీ పెళ్లి చేసుకుంటే మొగాడి […]

Written By:
  • NARESH
  • , Updated On : September 28, 2020 / 10:02 AM IST

    women2

    Follow us on


    అప్పటివరకు బ్యాచ్ లర్ గా ఇష్టమైన జీవితం గడిపిన వారు పెళ్లి కాగానే బందీ అయిపోయినట్టు ఫీలవుతారు.. పెళ్లి చేసుకుంటే రాత్రి ఠంచనుగా ఇంటికి రావాలి.. పెళ్లాం, పిల్లల్ని చూసుకోవాలి.. బయట ఆఫీసులో గొడ్డి చాకిరీ చేసి సంపాదించి కుటుంబాన్ని పోషించాలి. లేకపోతే ఆ మగాడికి.. ఆ మొగుడికి విలువ లేదంటారా ఆడవాళ్లు..

    ఇక సంసారం గురించి.. భార్య బాధితుల గురించి ఎన్నో సినిమాలు, సీరియల్లు, కామెడీ షోల్లో వివరిస్తూనే ఉంటారు. ఇంతకీ పెళ్లి చేసుకుంటే మొగాడి స్వేచ్ఛ హుళక్కేనా..? అతడి పెళ్లాం చట్రంలో ఇరుక్కుపోవాల్సిందేనా..? పెళ్లి మగాడి జీవితానికి మంచిదా చెడ్డదా.? దీనిపై బ్రిటన్ లోని ఆస్టన్ యూనివర్సిటీ పరిశోధకులు పరిశోధించారు.

    గుండె జబ్బులు, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం ముప్పు ఎదుర్కొంటున్న  దాదాపు పది లక్షల మందిపై ఆస్టన్ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేశారు. ఐదేళ్ల తరువాత మరోసారి పరీక్షించారు. పెళ్లి కాని వారితో పోలిస్తే .. పెళ్లయిన వారిలో ఈ లక్షణాలు బాగా తగ్గిపోయాయట.. అవివాహితుల్లో పైన జబ్బులన్నీ 16శాతం పెరిగిపోయాయని తేలింది.

    పైన జబ్బులన్నీ రాకుండా ఉండాలంటే కుటుంబ బంధాలే ముఖ్యమని.. ఎవరైనా తోడుంటే ఏ జబ్బులు దరిచేరవని పరిశోధకులు తేల్చారు. పెళ్లి అయినవారిలో జబ్బులు తగ్గి.. పెళ్లి కానీ వారిలో జబ్బులు పెరిగిపోయాయని తేల్చారు. పెళ్లంటే నూరేళ్ల మంట కాదు.. పంట అని పరిశోధకులు తేల్చారు.