Archaeological Discoveries: మనకు ఉన్నపెంపుడు జంతువుల్లో కుక్కలు ప్రధానమైనవి. దీంతో వాటిని మనం జాగ్రత్తగా ఉంచుకుంటాం. మన ఇంటికి కాపలా కాసే కుక్కలతో మనకు ఎన్నో లాభాలుంటాయి. ఇంట్లోకి ఎవరైనా ప్రవశిస్తే అరుస్తాయి. ఇతర జంతువులు వచ్చినా హెచ్చరిస్తాయి. ఇలా కుక్క మనకు సేవ చేయడానికే ఉంటుంది. అన్నం పెట్టిన విశ్వాసాన్ని తన చేతల్లో చూపుతుంది. పెద్ద పెద్ద నేరాల్లో కరడుగట్టిన నేరస్తులను సైతం కనిపెడుతుంది. ఇంకా భూమిలో దాగి ఉన్న గుప్తనిధులను సైతం బయటకు తీస్తుంది
ఫ్రాన్స్ లో 1940లో ఓ యువకుడు తన పెంపుడు జంతువు కుక్కను వాకింగ్ కు తీసుకెళ్లాడు. ఇంతలో అది కనిపించలేదు. దీంతో దాని కోసం వెతకగా ఓ యాభై అడుగుల లోతులో ఉన్న గుహలో కనిపించింది. అతడు కూడా అక్కడకు వెళ్లి చూడగా ప్రాచీన మానవుల చిత్రాలు కనిపంచాయి. దీంతో అవి ప్రపంచానికి తెలిశాయి. ఇలా ఓ శునకం వల్ల అవి ప్రపంచానికి తెలియడం గమనార్హం.
ఇంగ్లండ్ లో కూడా మరో సంఘటన జరిగింది. అక్కడి బీచ్ కు ఓ మహిళ తన పెంపుడు కుక్కతో వెళ్లింది. కాసేపటికి తను అలసిపోయి ఓ చోట కూర్చుండగా కుక్క మాత్రం ఓ చోట తవ్వుతూ కనిపించింది. అక్కడ ఏముందని వెళ్లి చూడగా డైనోసార్ వెన్నెముక కనిపించింది. దీంతో 16 సంవత్సరాల పాటు కష్టపడి దాన్ని వెలికి తీశారు. దానికి శునకం పేరు రఫేల్ అని పేరుపెట్టారు.
పోలెండ్ లో కూడా ఓ పెంపుడు కుక్క తవ్వడం మొదలు పెట్టిన తరువాత వెళ్లి చూడగా అక్కడ ఓ మట్టికుండ లభించింది. దాన్ని తెరిచి చూడగా అందులో 13వ శతాబ్ధానికి చెందిన బంగారు నాణాలు ఉన్నాయి. చెక్ రిపబ్లిక్ లో కూడా కుక్క తవ్వడంతో కొడవలి, గొడ్డలి, కంకణాలు, బల్లాలు బయటపడ్డాయి. ఇవి కనుగొన్నందుకు అతడికి 360 డాలర్ల బహుమతి అందజేశారు.
అమెరికా, బ్రిటిష్ సేనలకు జరిగిన యుద్ధంలో మరణించిన సైనికులను పాతిపెట్టిన సమాధులను కడావర్ డాగ్స్ గుర్తించాయట. వాటిని వెలికితీయడంతో వారి సమాధులు బయట పడ్డాయి. ఇలా కుక్కలు ఏది ఉన్నా పసిగట్టి బయటకు తీసేదాకా విశ్రమించవు. అందుకే కుక్కను విశ్వాస జంతువు అంటారు.
ఇంగ్లండ్ లో ఓ పెంపుడు కుక్క తవ్వగా 19వ శతాబ్దానికి చెందిన 15 బంగారు నాణాలు బయట పడ్డాయి. వాటిని ఓ వ్యాపారి దగ్గరకు తీసుకెళితే 7380 డాలర్లు ఇస్తానని చెప్పాడట. చెక్ రిపబ్లిక్ లో మరో శునకం ఓ చోట తవ్వుతుండగా దాని యజమాని చూసి పరిశీలించగా ఓ పాత్ర కనిపించింది. దీంతో అతడు పురాతత్వ శాఖకు సమాచారం అందించగా వారు వచ్చి దాన్ని తెరిచి చూడగా 14వ శతాబ్ధానికి చెంది 300 వెండి నాణాలు లభించాయి.
కాలిఫోర్నియాలో కూడా పెంపుడు కక్క తవ్వడంతో ఓ డబ్బా కనిపించింది. దాన్ని తెరిచి చూడగా అందులో బంగారు నాణాలు బయటపడ్డాయి. ఇలా శునకాలు తమ వివేకంతో భూమిలో పాతిపెట్టిన వాటిని బయటకు తీయడంతో చాలా ప్రాంతాల్లో బంగారు నాణాలు లభించడం గమనార్హం.