Sarath Babu Assets: శరత్ బాబు కోట్ల ఆస్తికి వారసులు ఎవరు? చెల్లి సరిత షాకింగ్ కామెంట్స్!

రమాప్రభతో ఆయనకు విభేదాలు ఉన్నాయి. పలుమార్లు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. నేను సంపాదించింది మొత్తం శరత్ బాబు దోచేశాడని రమాప్రభ అంటారు. నేనే రూ. 60 కోట్ల విలువ చేసే ఆస్తి రమాప్రభ, ఆమె తమ్ముడు పేరున రాశానని శరత్ బాబు అంటారు.

Written By: Shiva, Updated On : May 24, 2023 7:07 pm

Sarath Babu Assets

Follow us on

Sarath Babu Assets: నటుడు శరత్ బాబు అనార్యోగంతో సోమవారం కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు చెన్నైలో కుటుంబ సభ్యులు నిర్వహించారు. కొడుకులు కూతుళ్లు లేని క్రమంలో సోదరుడే చితికి నిప్పంటించారు. శరత్ బాబు సక్సెస్ఫుల్ యాక్టర్. దశాబ్దాల పాటు పరిశ్రమలో ఉన్నారు. డిమాండ్ ఉన్న నటుడు కావడంతో ఆయన లక్షల్లో పారితోషికం తీసుకునేవారు. 1973 నుండి శరత్ బాబు విరామం లేకుండా నటించారు. ఈ క్రమంలో ఆయన కోట్లలో ఆస్తులు సంపాదించారు. శరత్ బాబు లేడీ కమెడియన్ రమాప్రభను వివాహం చేసుకున్నారు. 14 ఏళ్ల తర్వాత విడిపోయారు.

రమాప్రభతో ఆయనకు విభేదాలు ఉన్నాయి. పలుమార్లు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. నేను సంపాదించింది మొత్తం శరత్ బాబు దోచేశాడని రమాప్రభ అంటారు. నేనే రూ. 60 కోట్ల విలువ చేసే ఆస్తి రమాప్రభ, ఆమె తమ్ముడు పేరున రాశానని శరత్ బాబు అంటారు. నిజం ఏమిటో వారికే తెలియాలి. ప్రస్తుతం రమాప్రభ కనీసం సొంత ఇల్లు కూడా లేకుండా సాదా సీదా జీవితం గడుపుతుంది. శరత్ బాబు-రమాప్రభకు పిల్లలు లేరు. మరో మహిళను ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు. ఆమెతో కూడా పిల్లల్ని కనలేదు.

కన్నుమూసే వరకు నటించిన శరత్ బాబు ఆస్తులకు వారసులు ఎవరనే చర్చ మొదలైంది. చెప్పాలంటే ఆయనకు భార్య పిల్లలు లేరు కాబట్టి కుటుంబ సభ్యులే వారసులు అవుతారు. శరత్ బాబుది పెద్ద కుటుంబం. 14 మంది సంతానం అని సమాచారం. శరత్ బాబు ఆస్తులు ఎవరికి సంక్రమించాలి అనే విషయంపై ఆయన చెల్లెలు సరిత స్పందించారు. నాకు అన్నీ అన్నయ్యే. తండ్రిలా నా బాధ్యతలు నెరవేర్చాడు.

నా కొడుకును చదివించాడు. నా కూతురి పెళ్లి చేశాడు. ఆమె ఇటీవల బెంగుళూరులో డెలివరీ అయితే వచ్చి చూశాడు. శరత్ బాబుకు నా కూతురు అంటే చాలా ఇష్టం. ఆమెను దత్తత తీసుకోవాలని ప్రయత్నం చేశారు. నీ కూతురిని దత్తత తీసుకుంటానని నాతో అన్నప్పుడు నేను నవ్వి ఊరుకునేదాన్ని. ఆయనకు ఆ ఆలోచన ఉన్నప్పటికీ అది కార్యరూపం దాల్చలేదని సరిత అన్నారు. ఇప్పుడు అన్నయ్య ఆస్తులకు వారసులు ఎవరంటే నా దగ్గర సమాధానం లేదని, ఆమె అన్నారు.