spot_img
Homeట్రెండింగ్ న్యూస్SSC Student: రామాయణం ప్రాశస్యం ప్రశ్నకు షాకింగ్‌ సమాధానం!

SSC Student: రామాయణం ప్రాశస్యం ప్రశ్నకు షాకింగ్‌ సమాధానం!

SSC Student: పరీక్షల్లో విద్యార్థులు ఇటీవల మితిమీరిన తెలివి ప్రదర్శిస్తున్నారు. ప్రశ్నలకు జవాబులు సొంత పరిజ్ఞానంతో చాలా మంది విద్యార్థులు రాస్తున్నారు. విషయంపై అవగాహనతో సమాధానాలు రాస్తున్నారు. అయితే కొంతమంది కొంటె విద్యార్థులు వింతైన సమాధానం రాస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఓ పదో తరగతి విద్యార్థి రామాయణం ప్రాశస్త్యం తెలపండి అని అడిగిన ప్రశ్నకు రాసిన సమాధానం చూసి ఉపాధ్యాయుడు షాక్‌ అయ్యాడు. ఇంతకీ ఆ విద్యార్థి ఏం రాశాడో తెలుసా?

మార్కులు వేయకుంటే చేతబడి..
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ముగిశాయి. ఈ పరీక్షల్లో తెలుగులో రామాయణం ప్రాశస్త్యం గురించి ప్రశ్న అడిగారు. దీనికి ఓ విద్యార్థి ‘నాకు మార్కులు వేయకపోతే.. మా తాత చేత చేతబడి చేయిస్తా’ అని రాశాడు. ఈ సమాధానం రాసిన జవాబు పత్రం బాపల్ల పురపాలక ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడికి దొరికింది. ఆ సమాధానం చదివిన ఉపాధ్యాయుడు షాక్‌ అయ్యాడు. వెంటనే జవాబు పత్రాన్ని పై అధికారులకు చూపించారు.

ఆ విద్యార్థికి 70 మార్కులు..
ఈ ప్రశ్నపత్రం ఏ విద్యార్థిదో తెలియదు. కానీ, ఈ పరీక్షలో ఆ విద్యార్థికి 70 మార్కులు రావడం మరో విశేషం. అయినా సదురు విద్యార్థి తనకు తెలియని ప్రశ్నకు సమాధానం రాయకుండా ఇలా చేతబడి చేయిస్తానని రాయడంతో దానిని చదివిన ఉపాధ్యాయుడు అవాక్కయ్యాడు. ఇదే పరీక్షలో మరో ప్రశ్న రామాయణంలో పాత్ర స్వభావం గురించిన ప్రశ్నకు ‘ మంధర.. శివాజీ, మహారాజును తీసుకుని దండకారణ్యానికి వెళ్లింది’ అని రాశాడు. అది చూసిన ఉపాధ్యాయులు విస్తుపోయారు.

తుంటరి సమాధానాలు..
గతంలో ప్రశ్నలకు సమాధానం రాకపోతే రాయకుండా వదిలేసేవారు. కానీ ఇప్పుడు ఉపాధ్యాయులు సమాధానం రాకున్నా ప్రశ్నను అర్థం చేసుకుని అవగాహన మేరకు సమాధానం రాయాలని సూచిస్తున్నారు. ఎన్నో కొన్ని మార్కులు వస్తాయన్న ఉద్దేశంతో ఇలా చెబుతున్నారు. కానీ, విషయంపై అవగాహన లేక, బట్టీ చదువులతో ఏం సమాధానం రాయాలో తెలియక విద్యార్థులు ఇలా తుంటరి సమాధానాలు రాస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper
Exit mobile version