https://oktelugu.com/

Rashmi Gautam: చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చాను, అలా చేస్తుంటే బాధేసేది…. యాంకర్ రష్మీ షాకింగ్ కామెంట్స్

Rashmi Gautam: చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చాను, అలా చేస్తుంటే బాధేసేది.... యాంకర్ రష్మీ షాకింగ్ కామెంట్స్

Written By: , Updated On : April 10, 2024 / 04:05 PM IST
Rashmi Gautam recollects her struggles

Rashmi Gautam recollects her struggles

Follow us on

Rashmi Gautam: రష్మీ గౌతమ్ బుల్లితెర టాప్ యాంకర్స్ లో ఒకరు. జబర్దస్త్ ద్వారా వచ్చిన ఫేమ్ తో హీరోయిన్ గా కూడా అవకాశాలు దక్కించుకుంటుంది. కానీ ఆ సినిమాలేవీ పెద్దగా సక్సెస్ కావడం లేదు. దీంతో ఫోకస్ మొత్తం యాంకరింగ్ మీదే పెట్టింది. ఈటీవీలో పలు షోలు, ఈవెంట్లు చేస్తూ బిజీగా మారిపోయింది. నిజానికి హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టింది రష్మీ. హీరోయిన్ ఆఫర్స్ రాలేదు. దీంతో చిన్న చితకా పాత్రలు చేసింది.

ఇండస్ట్రీని వదిలేసి ఇంటికి వెళ్ళిపోవాలి అనుకున్న తరుణంలో ఆమెకు జబర్దస్త్ అవకాశం వచ్చింది. భాష రానప్పటికీ తన టాలెంట్ తో షోలో నిలదొక్కుకుంది. స్టార్ యాంకర్ గా ఎదిగింది. ఇప్పుడు స్మాల్ స్క్రీన్ పై హవా సాగిస్తుంది. కాగా కెరీర్ ప్రారంభంలో ఆమెకు ఇండస్ట్రీలో ఎదురైన అనుభవాలు రష్మీ చెప్పుకొచ్చింది. 14 ఏళ్లకే పరిశ్రమకు వచ్చిన రష్మీ చాలా ఇబ్బందులు పడిందట.

పైగా రష్మీ సింగిల్ పేరెంట్ సంరక్షణలో కెరీర్ లో ముందుకు వెళ్లడం చాలా కష్టం అయిందని రష్మీ తెలిపింది. రష్మీకి కొన్ని సినిమాల్లో మంచి పాత్రలు దక్కాయట. కానీ ఎడిటింగ్ లో ఆమె నటించిన సన్నివేశాలు తీసేసేవారట. తీరా సినిమా విడుదల అయ్యాక రష్మీ చాలా భాధపడేదట. మనం ఎంత కష్టపడినా ఇండస్ట్రీలో ఎదగాలంటే ఒకరి సపోర్ట్ ఉండాల్సిందే అని రష్మీ వెల్లడించింది.

పరిశ్రమలో అడుగు పెట్టే సమయానికి తనకి ఎటువంటి అవగాహన లేదని .. పైగా తనపై తరచూ నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయి అని రష్మీ పేర్కొంది. అయినా కూడా స్ట్రాంగ్ గా నిలబడాలి లేదంటే .. లైఫ్ లో ఎదగడం సాధ్యం కాదని రష్మీ గౌతమ్ చెప్పుకొచ్చింది. ఇప్పటికే పదికి పైగా సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. కానీ సరైన హిట్ పడలేదు. రష్మీకి ఇంకా ఆఫర్స్ వస్తున్నాయి.