Homeట్రెండింగ్ న్యూస్Apsara Case: ఎవరీ కార్తీక్‌ రాజా?: అప్సర వ్యవహారంలో సరికొత్త ట్విస్ట్‌

Apsara Case: ఎవరీ కార్తీక్‌ రాజా?: అప్సర వ్యవహారంలో సరికొత్త ట్విస్ట్‌

Apsara Case: సంచలనం రేకెత్తిస్తున్న అప్సర వ్యవహారంలో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. పూజారి సాయికృష్ణ, అప్సరకు శారీరక బంధం ఉందని, ఆమె గర్భం దాల్చడంతోనే హతమార్చాడని ప్రచారం జరిగింది. అంతేకాదు అప్సర వేధింపుల తట్టుకోలేకే సాయికృష్ణను ఆమెను హతమార్చాడని వదంతులు వ్యాపించాయి. ఇవి ఇలా ఉండగానే ఆదివారం అప్సర మరో యువకుడిని పెళ్లి చేసుకున్నట్టు ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్టు కొట్టాయి. ఇది జరుగుతుండగానే అప్సరకు సంబంధించిన మరో విషయం వెలుగులోకి వచ్చింది.

అంతకుముందే పెళ్లయిందా?

పూజారి సాయికృష్ణతో అప్సరకు మధ్య నడిచిన వ్యవహారానికి ముందే ఆమెకు తమిళనాడు రాష్ట్రం చెన్నైకి చెందిన కార్తీక్‌ రాజా అనే యువకుడికితో కలిసి ఉన్న ఫొటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. వాస్తవానికి అప్సర తమిళనాడు రాష్ట్రానికి చెందిన అమ్మాయి. ఈమె కార్తీక్‌ రాజా అనే యువకుడితో ప్రేమలో పడింది. ఇదే విషయాన్ని కార్తీక్‌రాజా తన ఇంట్లో చెప్పడంతో అతడి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కొడుకు అదే పనిగా ఆ అమ్మాయినే కలవరిస్తుండటంతో పెళ్లికి ఒప్పుకున్నారు. కరోనా సమయంలో అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి చేశారు. ఈ పెళ్లికంటే ముందే అప్సర అక్కా, బావ మీద పోలీస్‌ స్టేషన్‌లో చీటింగ్‌ కేసు నమోదయింది. ఈ విషయంత కార్తీక్‌ తల్లిదండ్రులకు తెలియడం, వారు అతడిని అడగడంతో కొత్త మేర మనస్పర్థలు తలెత్తాయి. తర్వాత వారు పోలీస్‌ స్టేషన్‌ నుంచి విడుదల కావడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. ఇక అప్పర, కార్తీక్‌ పెళ్లి చేసుకున్న తర్వాత వేరు కాపురం పెట్టారు. వారు వేరే కాపురం పెట్టేందుకు అవసరమైన సామగ్రిని కార్తీక్‌ తల్లి సమకూర్చింది.

వేధించేదా?

కార్తీక్‌ తల్లి చెప్పిన వివరాల ప్రకారం.. అప్సర హై ఫై లైఫ్‌ కోరుకునేది. సకల సౌకర్యాలను అనుభవించాలని అనుకునేది. వీటంన్నింటినీ సమకూర్చాలని కార్తీక్‌ మీద ఒత్తిడి తెచ్చేది. తాను కోరినవన్నీ ఇస్తే కార్తీక్‌తో మంచిగా ఉండేది. లేకుంటే అతడితో తగువు పెట్టుకునేది. ఈవిషయాలన్నీ తల్లితో చెప్పుకుని కార్తీక్‌ బాధపడేవాడు. పైగా అప్సర అస్తమానం ఫోన్లో మాట్లాడుతోందని, తనను పట్టించుకోవడం లేదని కార్తీక్‌ ఆమెకు విడాకులు ఇచ్చాడు. తర్వాత కొద్ది రోజులకే మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి అతడి తల్లిదండ్రులు కూడా మానసికంగా కుమిలిపోయారు.

టీవీల్లో చూసి..

అప్సర ఉదంతానికి సంబంధించి టీవీల్లో వార్తలు వస్తుండటంతో కార్తీక్‌ తల్లి స్పందించారు. తన కొడకు, అప్సరకు మధ్య జరిగిన వ్యవహారానికి సంబంధించి ఒక వాయిస్‌ మేసేజ్‌ను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. దీంతో అప్సర ఉదంతం మరో మలుపు తిరిగింది. దీనిపై అప్సర తల్లిదండ్రులను వివరణ కోరితే.. ‘అంతా పై వాడే చూసుకుంటాడని’ చెప్పారు. పెళ్లి జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తే వారు సమాధానం చెప్పకుండా దాట వేస్తున్నారు. దీంతో అప్సర కేసును ఎలా విచారణ చేయాలో అర్థం కాక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. మొన్నటి దాకా సాయికృష్ణ అప్సరను హతమార్చాడని వార్తలు వచ్చాయి. అప్సర అమాయకురాలని కామెంట్లు విన్పించా యి. కార్తీక్‌ అనే వ్యక్తి ప్రస్తావన తెరపైకి రావడంతో అనూహ్యంగా మరో మలుపు తిరిగింది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...
Oktelugu Epaper
Exit mobile version