Dil Raju: స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కొత్త బ్యానర్ స్టార్ట్ చేశారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ పేరుతో మరో సంస్థ ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్ లో మొదటి సినిమాగా ‘బలగం’ రాబోతుంది. ఈ చిత్ర దర్శకుడు జబర్దస్త్ ఫేమ్ టిల్లు వేణు కావడం విశేషం. దిల్ రాజు నిర్మాణంలో టిల్లు వేణు మూవీ అని చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. దీనిపై క్లారిటీ వచ్చింది. బలగం చిత్ర నిర్మాణం కూడా పూర్తి అయినట్లు సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకొని విడుదల కానుంది. ఒక బ్యానర్ ఉండగా దిల్ రాజు ప్రొడక్షన్స్ పేరుతో మరో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ క్రమంలో దిల్ రాజు కారణం తెలియజేశారు. శ్రీవెంకటేశ్వర ప్రొడక్షన్స్ ఎదిగే కొద్దీ కొత్త వాళ్ళు ఆ బ్యానర్ లో మూవీ చేయడానికి భయపడుతున్నారు. దిల్ రాజు పెద్ద సినిమాలు మాత్రమే చేస్తారు. చిన్న దర్శకులతో, నటులతో సినిమాలు తీయరని భావిస్తున్నారు. అలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేయడానికి దిల్ రాజు ప్రొడక్షన్స్ స్టార్ట్ చేశాము. శ్రీవెంకటేశ్వర ప్రొడక్షన్స్ ద్వారా చాలా మంది నటులు, సాంకేతిక నిపుణులను పరిశ్రమకు పరిచయం చేశాము.
దిల్ రాజు ప్రొడక్షన్స్ లో కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తాము. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అప్ కమింగ్ దర్శకులు, నటులతో చిత్రాలు నిర్మిస్తాము, అని చెప్పుకొచ్చారు. దిల్ రాజు కుమార్తె హర్షిత రెడ్డి ఈ బ్యానర్ లో సినిమాలు చేస్తారని తెలుస్తుంది. ఆల్రెడీ దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ లో ఎటిఎం టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ తెరకెక్కించారు. బలగం మొదటి సినిమాగా తెలుస్తుంది. కొత్త వారిని ఎంకరేజ్ చేయడానికి ఈ సంస్థ స్థాపించామని చెప్పడం శుభపరిణామం.

కాగా పరిశ్రమలో దిల్ రాజు ప్రయాణం డిస్ట్రిబ్యూటర్ గా మొదలైంది. దిల్ సినిమాతో నిర్మాతగా మారి పలు హిట్ సినిమాలు నిర్మించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అంటే మంచి సినిమాలు తీస్తారనే ఒక బ్రాండ్ నేమ్ దిల్ రాజుకు పడింది. ఇరవై ఏళ్లలో 50 సినిమాలు తీయడం అంటే సామాన్యమైన విషయం కాదు. దశాబ్దాలుగా ఉన్న టాప్ ప్రొడక్షన్ హౌస్లు కూడా నిర్మాణంలో వెనుకబడ్డాయి. దిల్ రాజు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ లో సినిమాలు తీస్తూ తనకు తిరుగులేదని నిరూపించుకుంటున్నారు.