Bigg Boss 6 Telugu Mid Week Elimination: బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలే మరో రెండు రోజుల్లో జరగనుంది.. 21 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ సీజన్ ఇప్పుడు 6 మంది కంటెస్టెంట్స్ కి చేరుకుంది..ఈ సీజన్ లో వచ్చినన్ని ట్విస్టులు గతంలో ఏ సీజన్ లో కూడా రాలేదు..కేవలం తెలుగులోనే కాదు..హిందీ , తమిళం , మలయాళం మరియు కన్నడ లో కూడా ఇలాంటి ట్విస్టులు లేవు..కచ్చితంగా టాప్ 5 లో ఉంటారు అనుకున్న కంటెస్టెంట్స్ మాత్రమే కాదు..టైటిల్ గెలుచుకుంటారు అని అనిపించిన కంటెస్టెంట్స్ కూడా ఎలిమినేట్ అయిపోవడం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఉదాహరణకి గత వారంలో జరిగిన ఇనాయ ఎలిమినేషన్ ని తీసుకోవచ్చు..ఓటింగ్ ని బట్టి కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చెయ్యడం లేదు.. బిగ్ బాస్ కి ఇష్టమొచ్చిన వారిని సేఫ్ చేస్తూ మిగిలిన వాళ్ళని ఎలిమినేట్ చేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి..ఇక గ్రాండ్ ఫినాలే కి వెళ్లే ముందు ఒక కంటెస్టెంట్ ని ‘మిడ్ వీక్ ఎలిమినేషన్’ చేస్తామని నాగార్జున గత వారం తెలిపిన సంగతి తెల్సిందే.
ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని కాసేపటి క్రితమే విడుదల చేసారు..ప్రతిరోజు ఉదయం సాంగ్ తో ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరిని నిద్రలేపే బిగ్ బాస్ ,ఈసారి మాత్రం కుక్క అరుపుల సౌండ్ తో లేపుతాడు..ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని గార్డెన్ ఏరియా కి రమ్మంటాడు బిగ్ బాస్..గార్డెన్ ఏరియాకి వచ్చిన తర్వాత ఉన్న కంటెస్టెంట్స్ లో టాప్ 5 లో ఉండడానికి అనర్హులు ఎవరో ఏకాభిప్రయం తో చెప్పాలంటూ బిగ్ బాస్ ఆదేశిస్తాడు.
అప్పుడు శ్రీహాన్ ముక్కుసూటిగా రోహిత్ పేరు చెప్తాడు. ఇక కీర్తి తనకు నచ్చలేదని ఆది రెడ్డి పేరు చెప్తుంది, శ్రీ సత్య.. కీర్తి పేరు చెప్తుంది.. రోహిత్ ఏమో తిరిగి శ్రీహాన్ అనర్హుడు అంటూ పేరు చెప్తాడు. ఆది రెడ్డి తనను నామినేట్ చేసిన కీర్తి పేరు చెప్తాడు..రేవంత్ ఎవరి పేరు చెప్తాడో ప్రోమో లో చూపించలేదు..అందరికంటే ఎక్కువ ఓట్లు కీర్తి కి ఎక్కువ రావడంతో కంటెస్టెంట్స్ తరుపున నామినేట్ చెయ్యబడిన కంటెస్టెంట్ గా ఆమె నిలిచింది.

మరి ప్రేక్షకుల ఓట్ల ద్వారా తక్కువ వచ్చిన కంటెస్టెంట్ అంటూ బిగ్ బాస్ ప్రోమో లో సస్పెన్స్ మెయింటేన్ చేసాడు.. ఒకేవేళ ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా కాకుండా ఇంటి సభ్యుల ఓటింగ్ ద్వారా నామినేట్ అయినా కీర్తి ని ఎలిమినేట్ చేస్తే బిగ్ బాస్ మీద ప్రేక్షకుల్లో నెగెటివిటీ తారాస్థాయికి చేరుకుంటుంది..ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం అయితే శ్రీ సత్యకి అందరికంటే తక్కువ ఓట్లు వచ్చాయి.. మరి ఆమె ఎలిమినేట్ అవుతుందా..లేదా కీర్తి ఎలిమినేట్ అవుతుందా అనేది తెలియాలంటే రాత్రి వరుకు వేచి చూడాల్సిందే.