Fastag: టోల్ ట్యాక్స్ చెల్లించేందుకు వినియోగదారులు ఫాస్టాగ్ విధానంలో చెల్లిస్తున్నారు. ఫాస్టాగ్ విధానంలో చెల్లించని వారికి డబుల్ టోల్ ట్యాక్స్ వేస్తున్నారని ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ వేసిన పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ మేరకు రవీందర్ త్యాగి అనే వ్యక్తి వేసిన పిటిషన్ పై వాదనలు వినిపించింది. వాహనదారులు ఫాస్టాగ్ వినియోగించుకోకుండా నగదు చెల్లింపులు చేసినట్లయిే వారి నుంచి డబుల్ రేట్లతో టోల్ వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏ) కేంద్రం విధానమేంటని ప్రశ్నించింది. ఈ విషయంలో అధికారుల తీరు ఏమిటని అడిగింది. దీంతో అధిరారులు తమ ప్రత్యుత్తరాలు దాఖలు చేసేందుకు నాలుగు వారాల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్ 18కి వాయిదా వేసింది. ఫాస్టాగ్ లేని వాహనదారుల నుంచి డబుల్ రేట్లు వసూలు చేయడం తగదని చెప్పింది. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్, ఆఫ్ ఇండియా (ఎంఓఆర్ టీ అండ్ హెచ్), నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ)లతో కూడిన నేషనల్ హైవీ అమాండ్ మెంట్ రూట్స్ 2020 చట్టాన్ని రద్దు చేయాలని పిటిషనర్ కోరారు.
దీంతో అన్ని రూట్లను ఫాస్టాగ్ గా మారుస్తున్నారు. టోల్ టాక్స్ నిబంధనలు సామాన్యుడికి గుదిబండగా మారుతున్నాయి. రెట్టింలో టోల్ టాక్స్ కట్టడం వల్ల వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ప్రయాణికులు రెట్టింపులో టాక్స్ చెల్లించడంతో ఆందోళన చెందుతున్నారు. చాలా మంది ఫాస్టాగ్ కంటే నగదు చెల్లించేందుకే మొగ్గుచూపుతున్నారు. దీంతో కొందరు తమ వాహనంలోనే ఫాస్టాగ్ పరికరాన్ని ఇన్ స్టాల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. దీనికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలని కోర్టు అడిగింది.

ఢిల్లీ నుంచి హర్యానాలోని ఫరీదాబాద్ మార్గంలో ప్రయాణికుల నుంచి వసూలు చేసే టోల్ టాక్స్ తో వారు ఎంత ఆవేదన చెందారో ప్రత్యక్షంగా చూశానని పిటిషనర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ,19 ప్రకారం డబుల్ టోల్ టాక్స్ వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమని సూచించింది. డబుల్ టోల్ టాక్స్ రద్దు చేయకపోతే వినియోగదారులకు నష్టం వస్తుందని చెబుతున్నారు. ఫాస్టాగ్ ను వినియోగించుకునేందుకు ప్రయాణికులకు మరింత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని తేల్చింది. దీంతో వినియోగదారులకు ఊరట కానుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
టోల్ గేట్ల వద్ద వాహనదారులు గంటల తరబడి వేచి ఉండకుండా కేంద్రం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ తరహాలో ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ (ఫాస్టాగ్ )ను ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి 14,2021న ఫాస్టాగ్ విషయంలో వాహనదారులకు కేంద్రం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే కేంద్రం వినియోగదారులకు ఫాస్టాగ్ వినియోగించాలని చెప్పినా వారు పట్టించుకోవడం లేదు. అందుకే డబుల్ టాక్స్ వేస్తున్నారు. ఇప్పటికైనా వినియోగదారులు ఫాస్టాగ్ తీసుకోవాలని చెబుతోంది.