India vs China: మనకు మూడు వైపుల సముద్రం ఉంది. ఒక వైపు మాత్రమే భూభాగం ఉంది. దీంతో మూడు దిక్కుల నుంచి ఏ ముప్పు లేదు కానీ ఉత్తర దిశలో ఉన్న పాకిస్తాన్, చైనాతో మనకు నిత్యం కయ్యమే. గతంలోనే గల్వాన్ లోయలో భారత సైనికులను పొట్టన పెట్టుకున్న డ్రాగన్ తాజాగా సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణకు దిగుతోంది. ఈ నేపథ్యంలో మన సైనికులు సైతం వీరోచితంగానే పోరాడుతున్నారు. మన దేశం కోసం వారి ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు. మనం ఇంత ధీమాగా ఉంటున్నామంటే దానికి కారణం వారే. మనం కనిపించని దేవుళ్లకు మొక్కుతుంటాం. ప్రత్యక్షంగా కనిపించే దేవుళ్లు మాత్రం సైనికులే. వారి త్యాగాలతోనే మనం జీవనం కొనసాగిస్తున్నాం.

ఈనెల 9న అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో చైనా సైనికులు 300 మందితో మన సైనికులు 100 మంది పోరాడారు. ఇరుదేశాల సైనికులు రాడ్లు, కర్రలతో దాడి చేసుకున్నా మనవారు భయపడలేదు. రక్తమోడుతున్నా వారిని నిలువరించేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. మన వారు తక్కువగా ఉన్నా వారిని నియంత్రించడంలో మనవారు చూపిన తెగువ ప్రతి ఒక్కరికి చలనం కలిగించింది. దేశం కోసం వారు పోరాడుతున్న దృశ్యాలు చూసి చలించారు. మన వీర సైనికులకు సెల్యూట్ చేస్తున్నారు.
మూడు వందల మందిని అడ్డుకునేందుకు మన సైనికులు ప్రదర్శించిన సాహసం ఎనలేనిది. వారి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. మనం ఏం చేసినా తప్పులేదు. వారి త్యాగాలతో మన దేశం సుభిక్షంగా ఉంటోంది. గతంలో గల్వాన్ లోయలో కూడా ఇదే విధంగా దొంగ దెబ్బ తీసి మన వారి ప్రాణాలు తీసిన చైనా ఇప్పుడు మరో కుట్రకు తెర తీస్తోంది. అనవసరంగా మనతో కయ్యం పెట్టుకునేందుకు నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. మనదేశంలో అమెరికా మనతో కలిసి చేసిన సైనిక విన్యాసాలతో డ్రాగన్ రెచ్చిపోతోంది. మనల్ని టార్గెట్ చేసుకుని మన మీదకు దాడి చేయాలని భావిస్తోంది. కానీ దాని కుట్రలను తిప్పి కొట్టడంలో మన వారు చూపిస్తున్న ధైర్యం భారతీయులకు ఎంతో బాసటగా నిలుస్తోంది.

డ్రాగన్ కుయుక్తులకు భయపడేది లేదు. ఎంతటి స్థితినైనా ఎదుర్కొనే సత్తా భారత్ కు ఉంది. ఇండియా ఎవరి దయాదాక్షిణ్యాల మీద బతకడం లేదు. మన దేశ మార్కెట్ మీదే చైనా ఆధారపడి బతుకుతోంది. మనం వ్యాపార లావాదేవీలు ఆపేస్తే చైనాకు మనుగడే ఉండదు. కానీ ఎందుకులే అనే ధోరణిలో మనం ఉంటే డ్రాగన్ కుట్రలతో మన మీద కక్ష తీర్చుకోవాలని చూస్తోంది. ఇలాగైతే దానికే ప్రమాదం అని పలువురు విశ్లేషకులు సూచిస్తున్నారు. మన సైనికుల పోరాటానికి సామాజిక మాధ్యమాల్లో ప్రజలు వందనం చేస్తున్నారు. వారి ధీరత్వానికి సెల్యూట్ చేస్తున్నారు.
Interesting video of Indian forces thwarting Chinese PLA attempts to enter Indian territory at the LAC. This is an undated video. Location unknown. It doesn’t seem to be of Tawang incident in Arunachal but definitely from similar area and post 2020 Galwan clash. Watch now 👇 pic.twitter.com/e5mra6DK9t
— Aditya Raj Kaul (@AdityaRajKaul) December 13, 2022