Vizianagaram: వేలు పెట్టుబడి.. లక్షల్లో ఆదాయం.. ఈమె ఆలోచనతో కోట్లు కురుస్తున్నాయి

వర్మీ కంపోస్ట్ యూనిట్ ను ఏర్పాటు చేసుకొని సొంతంగా ఎరువులు, వేపపిండి, కాగు పిండి, ఆవు మూత్రం, పంచగవ్యం తయారు చేసి పంటలకు పిచికారీ చేస్తుంటుది. ఇక బయట నారు కొనుగోలు చేయకుండా సొంతంగా నారు కూడా పెంచుతుంది.

Written By: Suresh, Updated On : December 27, 2023 4:51 pm

Vizianagaram

Follow us on

Vizianagaram: తెలివి ఉండాలి గానీ సాధ్యం కానిది ఏంటి చెప్పండి. మనిషికి ప్రతి ఒక్కటి సంపాదించే, సాధించే శక్తి ఉంది. డబ్బులు కూడా చాలా విధాలుగా సంపాదించవచ్చు. కూరగాయలు పండిస్తూ కూడా వార్తల్లో నిలవచ్చు. అయితే ఎవరైనా ఒకటి రెండు కూరగాయలు పండిస్తారు. కానీ ఓ మహిళ మాత్రం చాలా కూరగాయలు, ఆకుకూరలు పండిస్తూ తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలను ఆర్జిస్తుంది. మరి ఆ వివరాలు ఓ సారి చూసేయండి. ఉపయోగపడితే మీరు కూడా ఆచరించేసేయండి.. ఆమెది విజయనగరం జిల్లా డెంకాడ.

రంగుల అక్కమ్మ అనే ఓ మహిళ ఏకంగా 30 సంవత్సరాల నుంచి సాగు చేస్తుంది. అంతేకాదు ఉత్తమ రైతుగా 2016లోనే అవార్డు అందుకుంది. ఈమెకు ఉన్న ఎకరా స్థలంలోనే బీరకాయ, బెండ, క్యాబేజీ, అనప, ఉల్లి, మిరప కూరగాయలు మాత్రమే కాదు తోటకూర, పాలకూర, చుక్కకూర వంటి ఆకుకూరలు కూడా సాగు చేస్తుంది. అది కూడా సేంద్రీయ పద్దతిలో సాగు చేస్తుంది ఈ మహిళ రైతు. అదే పొలం గట్టులో అరటి, మునగ, బంతి మొక్కలు కూడా వేస్తుంది. మరి ఇవన్నింటికి నీరు కావాలి. దానికి కావాల్సిన సౌకర్యం కూడా ఏర్పాటు చేసుకుంది.

వర్మీ కంపోస్ట్ యూనిట్ ను ఏర్పాటు చేసుకొని సొంతంగా ఎరువులు, వేపపిండి, కాగు పిండి, ఆవు మూత్రం, పంచగవ్యం తయారు చేసి పంటలకు పిచికారీ చేస్తుంటుది. ఇక బయట నారు కొనుగోలు చేయకుండా సొంతంగా నారు కూడా పెంచుతుంది. ఇక తీగ జాతుల కోసం సిమెంట్ స్థంబాలను ఏర్పాటు చేసుకుంది రంగుల అక్కమ్మ. వీటి లోపల బంతి తోట పెంచింది. కట్టలపై తీగ జాతి కూరగాయలు, లోపల కూరగాయల పంటలు వేస్తూ తక్కువ ప్రాంతంలో ఎక్కువ కూరగాయలు పండిస్తూ చాలా లాభాలను ఆర్జిస్తుంది.

ఈ సంవత్సరం బీర విత్తనాలకు పదిహేను వందలు, పురుగు మందులు, ఎరువులకు ఐదు వేలు, కలుపుతీతకు వెయ్యి రూపాయలు ఖర్చు చేసిందట. ఇక ఈ ఖర్చులు పోగా సుమారు యాభై వేల రూపాయల లాభం వచ్చిందట. ఇది కేవలం బీరకాయలపై సంపాదించిన డబ్బు మాత్రమే. ఇక వంకాయల విక్రయాలపై ఏకంగా రూ. 80వేల లాభం వచ్చిందట. అనపలో రూ. 20వేలు వస్తే.. ఇతర వాటిపై మరింత ఎక్కువ లాభం వచ్చిందని తెలిపింది. కేవలం యాభై వేల వరకు ఖర్చు చేసి ఏకంగా మూడు లక్షల వరకు ఆదయం ఆర్జించి ఆదర్శ రైతుగా పేరు సంపాదించింది. అంతే కాదు ఉత్తమ రైతు అవార్డు కూడా అందుకుంది అక్కమ్మ. మరి మీకు ఈ ఐడియా నచ్చితే ఇంకెందుకు ఆలస్యం కష్టపడడానికి సిద్ధమవ్వండి..