Revanth Reddy : శ్వేత పత్రం ప్రచురణతో గ్యారంటీల అమలుకు నిధులెలా?

తెలంగాణ కాంగ్రెస్ శ్వేత పత్రం ప్రచురణతో గ్యారెంటీల అమలుకు నిధులెలా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : December 27, 2023 2:29 pm

Revanth Reddy : రేవంత్ రెడ్డి నిన్న ప్రధానమంత్రిని కలిశారు. ఈ భేటితో ఒరిగేది ఏమీ ఉండదు. ఎందుకంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బీజేపీ తరుఫున ప్రధాన మంత్రిని కలవడంతో నిధులు, విధుల్లో పెద్దగా సత్ఫలితాలు ఉండవు. ప్రధాని-సీఎం మధ్య సంబంధాల వరకే ఉంటాయి.

మొట్టమొదటి సీఎం అయ్యాక మర్యాదపూర్వకంగా కలవడం ఒక ఎత్తు.. రెండోది రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కలుస్తాడు. ఇక్కడ తేడా ఏంటంటే.. కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యాక ప్రధాని మోడీని కలవడం మానేశారు. తెలంగాణ సీఎం రేవంత్ అయ్యాక మొట్టమొదటిసారి కలిశారు.

ప్రధానిని రేవంత్ రెడ్డి కలిసింది ప్రధానంగా నిధుల గురించే.. ఖజానా ఖాళీ అయ్యిందని.. 7 లక్షల కోట్ల అప్పు ఉందని చెబుతున్నారు. కేటీఆర్ స్వేద పత్రం రిలీజ్ చేసిన వర్కవుట్ కాలేదు. నిజం బయటపడింది.

తెలంగాణ ఖజానా ఖాళీ అయ్యింది. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారు.

ఈ 6 గ్యారెంటీల్లో సిస్టంలో ఈజీగా ఫిట్ అవుతాయి. కొన్ని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఈజీనే.. అలాగే రూ.500 గ్యాస్ సబ్సిడీ కూడా పెద్ద కష్టం కాదు. రైతు భరోసా కూడా ఫిల్టర్ చేసి ఇవ్వనున్నాడు. అయితే వీటన్నింటికి నిధులు ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తాడని ప్రశ్న.

తెలంగాణ కాంగ్రెస్ శ్వేత పత్రం ప్రచురణతో గ్యారెంటీల అమలుకు నిధులెలా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.