Ancient Iraqi City: నదుల్లోని నీటిని వినియోగించుకునేందుకు లేదా పంటలు పండించడానికో లేదా విద్యుత్ కోసం రిజర్వాయర్లు లేదా డ్యాంలను ప్రభుత్వం నిర్మిస్తుంది. దీని వల్ల దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాల పై ఆ కట్టడాలు బాగా ప్రభావం చూపిస్తాయి. అవి మునిగిపోవడం లేదా కనుమరుగైపోవడం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే నైసర్గిక భూగోళ స్వరూపాన్ని మార్చేస్తాయి. ఈ డ్యాంలను నిర్మించడానికి భూమిని చాలా లోతుగా తవ్వి నిర్మిస్తుంటారు. దీంతో చుట్టూ ఉన్న పొలాలు, ఇళ్లు, ప్రాంతాలు ఆ నది ప్రవాహానికి ధ్వంసమైపోతాయి. అచ్చం అలానే ఇక్కడొక నదిపై నిర్మించిన రిజర్వాయర్‌తో పురాతనమైన నగరం కనుమరుగైపోయింది. ప్రస్తుతం ఆ రిజర్వాయర్‌లో నీటి నిల్వలు తగ్గడంతో బయటపడింది. అది ఎక్కడ? ఏంటా నగరం.. చదవండి.

కెమునేలోని కుర్దిస్థాన్ ప్రాంతంలో దాదాపు మూడు వేల ఏళ్ల నాటి పురాతన ఇరాక్ నగరం బయటపడింది. వాస్తవానికి టైగ్రిస్ నదిపై నిర్మించిన రిజర్వాయర్‌లో నీటి స్థాయిలు తగ్గిపోవడంతో ఈ నగరం బయటపడింది. ఇది కాంస్య యుగానికి చెందిన ఒక పురాతన సామ్రాజ్యం అని ఆర్కియాలజీ శాస్త్రవేత్తల బందం పేర్కొంది. ఆర్కియాలజీ బందంలోని డాక్టర్ ఇవానా పుల్జిజ్ ఈ నగరం నేరుగా ట్రెగ్రిస్ నదిపై ఉన్నందున మిట్టాని సామ్రాజ్యంలోని ప్రధాన ప్రాంతాలతో అనుసంధానించి ఉందని చెబుతున్నారు.
Also Read: Prophet Muhammad Row: మహ్మద్ ప్రవక్త’పై వ్యాఖ్యల వివాదం: భారత్ , ముస్లిం దేశాల సంబంధాలపై ఎఫెక్ట్

ఇరాక్ ప్రభుత్వం కూడాఈ రిజర్వాయర్ తిరిగి నిండక ముందే తవ్వకాలు జరిపి ఆ నగరానికి సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు జర్మన్‌కి చెందిన ఆర్కియాలజీ బందానికి అనుమతిచ్చింది. ఈ మేరకు ఈ నగరానికి సంబంధించిన కొన్నిఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. క్రీస్తు పూర్వం 1550 నుంచి 1350లలో మిట్టని సామ్రాజ్యం పాలనలో ఈ పురాతన నగరం కీలక కేంద్రంగా ఉందని తెలిపింది. ఐతే ఆ రిజర్వాయర్‌లో మళ్లీ నీటి నిల్వలు పెరగడంతో ఆ పురాతన ప్రదేశానికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా తవ్విన భవనాలను ప్లాస్టిక్ షీటింగ్‌తో చుట్టి ఉంచారు. ప్రస్తుతం ఆ నగరం మరోసారి పూర్తిగా మునిగిపోయింది.
Also Read:AP SSC Results – JanaSena: జగన్ కు ఇది అవమానం.. జనసేనకు కొత్త వరం..
[…] […]