Health Tips: ఇటీవల కాలంలో మనిషి జీవితచక్రం మారుతోంది. ఆధునిక పోకడలతో అనర్థాలు తెచ్చుకుంటున్నారు. పోషకాహారం కాకుండా నోటికి ఇంపైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నారు. ఫలితంగా బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్ వంటి రోగాలను కొనితెచ్చుకుంటున్నారు. దీని వల్ల పట్టుమని పది నిమిషాలు కూడా ఓపికగా కూర్చోవడం లేదు. దీంతో నొప్పుల ప్రభావం కూడా అధికంగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆహార నియమాలు పాటిస్తేనే ఆరోగ్యం బాగుంటుందని వైద్యులు చెబుతున్నారు.

మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత సాయంత్రం అవుతుండగా కాస్త బడలిక రావడం అందరికి అలవాటే. ఈ సమయంలో కాఫీ, టీ, సమోసా, పకోడీ లాంటివి లాగిస్తూ ఉత్సాహాన్ని కొని తెచ్చుకుంటారు. కానీ వీటితో అనర్థమే. కాస్త మనసు పెడితే దీని నుంచి కూడా సులభంగా బయట పడొచ్చు. కానీ మనకు అందుబాటులో ఉండే వాటితోనే మనం రిలాక్స్ అవుతుంటాం. అవి తీసుకుంటే మన ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపించొచ్చు. అందుకే కొన్ని చిట్కాలు పాటించి అలసటను దూరం చేసుకునే పద్ధతులు ఇప్పుడు చూద్దాం.
Also Read: Prophet Muhammad Row: మహ్మద్ ప్రవక్త’పై వ్యాఖ్యల వివాదం: భారత్ , ముస్లిం దేశాల సంబంధాలపై ఎఫెక్ట్
ఒంట్లో నిస్సత్తువ ఆవహిస్తే తక్షణమే సీట్లో నుంచి లేచి కాస్తంత అటూ ఇటూ నడవాలి. దీంతో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఫలితంగా ఉత్సాహం ఇనుమడిస్తుంది. అంతే కానీ కాఫీ, టీల జోలికి వెళ్లొద్దు. వాటితో మొదట బాగానే ఉన్నా తరువాత దుష్ఫరిణామాలు చోటుచేసుకోవడం తెలిసిందే. మనం ఉదయం తీసుకునే అల్పాహారమే బాగుండేలా చూసుకోవాలి. పోషక విలువలు కూడిన అల్పాహారం తీసుకుంటే రోజంతా హాయిగా ఉంటుంది. ఎలాంటి బద్దకం కూడా మనల్ని ఆవహించదు.

తాగునీరు కూడా ప్రతి గంటకో గ్లాసు తాగితేనే ఆక్సిజన్ విలువలు అందుతాయి. ఫలితంగా శరీరం అలసిపోకుండా ఉంటుంది. రోజంతా హుషారుగా గడపాలంటే నీటి శాతం అవసరమే. అప్పుడోసారి అప్పుడోసారి గ్లాస్ నీరు తాగుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే హాయిగా ఉంటుంది. మన శరీరం కూడా యంత్రంలాంటిదే. అందుకే అప్పుడప్పుడు విశ్రాంతి ఇవ్వాలి. లేదంటే ఇబ్బంది ఏర్పడుతుంది. దీంతో పనిలో కాస్త విశ్రాంతి తీసుకుని కాసేపు హాయిగా ఉండాలి.
మధ్యాహ్నం పూట మూడుగంటల కంటే ముందు కాస్త కునుకు తీయాలి. అది కూడా 15 నిమిషాల పాటు కునుకు తీస్తే శరీరం రీ ఫ్రెష్ అవుతుంది. దీంతో రోజంతా హాయిగా పని చేసుకోవచ్చు. అందుకే బాడీకి రెస్ట్ ఇచ్చే క్రమంలో కూడా అందరు విధిగా పాటించి శరీరానికి విశ్రాంతి ఇచ్చి ప్రోత్సహిస్తే తిరిగి రెట్టించిన ఉత్సాహంతో పనిలో ఇరగదీస్తారు. దీంతో పనికి కూడా కొంత సమయం విరామం ఇచ్చి ఓ కునుకు వేస్తే మంచిది.
Also Read:Kalyan Dev: అల్లుడు కెరీర్ గాలికొదిలేసిన చిరంజీవి!