Prophet Muhammad Row: మహ్మద్ ప్రవక్తపై బీజేపీకి చెందిన నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా పెనుదుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం పెల్లుబుకడంతో భారతదేశం స్వయంగా తప్పు జరిగిందని.. ప్రపంచంలోని తమ భాగస్వామ్య దేశాలను శాంతింపచేయాల్సి వచ్చింది.

బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ ఒక టీవీ చర్చలో ఈ వ్యాఖ్యలు చేయగా.. ఢిల్లీ బీజేపీ నేత నవీన్ కుమార్ జిందాల్ ఈ అంశంపై ఒక ట్వీట్ చేశారు.దీంతో ఇవి దేశాన్ని పాలిస్తున్న బీజేపీయే చేసిందని.. భారత ప్రభుత్వంపై ముస్లిం దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నూపుర్ శర్మ వ్యాఖ్యలు దేశంలోని ముస్లిం సమాజానికి, అరబ్ దేశాలకు కోపం తెప్పించాయి. భారత్ రాయబారులకు ఆయా దేశాల్లో నోటీసులు జారీ చేసి వివరణలు కోరాయి. కువైట్, ఖతార్, ఇరాన్ దేశాలు ఆదివారం తమ నిరసనను భారతరాయబారులను పిలిచి వ్యక్తం చేశారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలను సౌదీ అరేబియా కూడా ఖండించింది. భారత్ తీరును తప్పుపట్టాయి.భారత్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఖతర్ డిమాండ్ చేసింది.
Also Read: AP SSC Results – JanaSena: జగన్ కు ఇది అవమానం.. జనసేనకు కొత్త వరం..
దీంతో భారత్ లోని బీజేపీ ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. వెంటనే నూపుర్ శర్మతోపాటు నవీన్ జిందాల్ చేత బహిరంగ క్షమాపణలు చెప్పించారు. వారిని బీజేపీ నుంచి సస్పెండ్ చేశారు. ఇక బీజేపీ సైతం స్వయంగా రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ‘ఏ మతాన్ని, వర్గాన్ని అవమానించే, కించపరిచే భావజాలానికి బీజేపీ వ్యతిరేకం. అలాంటి వ్యక్తులను బీజేపీ ప్రోత్సహించదు ’ అని పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది.

అయితే దేశంలో అధికారంలో బీజేపీ నేతలే ఈ వ్యాఖ్యలు చేయడంతో దేశ అంతర్గత విషయం కాస్తా అంతర్జాతీయ స్థాయిలో పెనుదుమారంగా మారింది. బీజేపీ తీసుకున్న తాజా చర్యలు సరిపోవని నిపుణులు అంటున్నారు.
ఇక భారతదేశం ఈ తప్పుపై పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేని వ్యక్తులు చేసిన ఈ వ్యాఖ్యలు ఏ విధంగా భారత్ ప్రభుత్వ అభిప్రాయాలకు, ఆలోచనలకు అద్దం పట్టవని ఒక ప్రకటనలో భారత ప్రభుత్వం తెలిపింది. బీజేపీ పార్టీ అగ్రనాయకత్వం, ప్రభుత్వం అనంతరం ఈ బహిరంగ ప్రకటన చేయాల్సి వచ్చింది.ఇలా చేయకపోతే ముస్లిం కీలక దేశాలతో భారత్ సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
మొత్తానికి కొందరు బీజేపీ అతి వాద బీజేపీ నేతల నోటిదురుసుకు ప్రపంచం ముందు భారత తలవంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది భారత ప్రభుత్వం పక్షపాత ధోరణి అని ఫోకస్ అయ్యింది. ముస్లిం దేశాల ముందు భారత్ ప్రకటన చేయాల్సిన అవసరం ఏర్పడింది.
Also Read:Woman Was Found Chopped: క్రైమ్ మిస్టరీ: ప్రేమించి పెళ్లాడి ఆమెను అతడు ఎందుకు చంపాడు..
[…] Also Read: Prophet Muhammad Row: మహ్మద్ ప్రవక్త’పై వ్యాఖ్యల వ… […]
[…] Also Read: Prophet Muhammad Row: మహ్మద్ ప్రవక్త’పై వ్యాఖ్యల వ… […]
[…] Also Read:Prophet Muhammad Row: మహ్మద్ ప్రవక్త’పై వ్యాఖ్యల వ… […]