
Rashmi-Sudheer Relationship: సుడిగాలి సుధీర్-రష్మీ గౌతమ్ లది ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ. జబర్దస్త్ వేదికగా మొదలైన వీరి ప్రేమ కహాని ఏళ్ల తరబడి సాగింది. బుల్లితెర ప్రేమ జంటగా వీరికి ఓ క్రేజ్ ఉంది. వీరిద్దరి కెమిస్ట్రీ ఓ రేంజ్ లో పండింది. రొమాంటిక్ స్కిట్స్, సాంగ్స్ అనేకం చేశారు. రెండుసార్లు ఉత్తుత్తి వివాహం కూడా చేసుకున్నారు. సుధీర్-రష్మీ ప్రేమికులన్న రూమర్ వారి కెరీర్ కి కూడా ప్లస్ అయ్యింది. బుల్లితెర స్టార్స్ గా ఎదగడంలో దోహదం చేసింది. జబర్దస్త్, ఢీ డాన్స్ రియాలిటీ షోలు ఆదరణ దక్కించుకోవడంలో తమ వంతు పాత్ర పోషించారు.
అసలు సుధీర్, రష్మీ మధ్య ఉన్న బంధం ఏమిటి? స్నేహితులా? ప్రేమికులా?. ఇదంతా కెరీర్ కోసమేనా? లేక సీరియస్ గా ఒకరినొకరు ఇష్టపడుతున్నారా? అనే సందేహాలు అలానే ఉన్నాయి. ఈ విషయం మీద పలుమార్లు స్పష్టత కోరే ప్రయత్నం జరిగింది. సుధీర్ నేరుగా ఆమె నాకు ఫ్రెండ్ మాత్రమే. అంతకు మించిన అనుబంధం మా మధ్య లేదంటూ చెప్పారు. రష్మీ మాత్రం సస్పెన్స్ లో పెట్టింది.
జీవితంలో ప్రతి విషయం బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు. సుధీర్ తో నాకున్న బంధం ఏమిటనేది వ్యక్తిగత విషయం. అందరికీ చెప్పాల్సిన పనిలేదు. అన్ని విషయాలు చెప్పేస్తే జీవితం దాపరికం అంటూ ఏమీ ఉండదని… చెప్పారు. కొన్ని సందర్భాల్లో సుధీర్ నాకు మిత్రుడు మాత్రమే అని వెల్లడించడం జరిగింది. అలాగే ఇద్దరూ పెళ్లి చేసుకోవడం లేదు. వేరొకరిని తమ ప్రేమికులుగా పరిచయం చేయడం లేదు. కాబట్టి రష్మీ -సుధీర్ రిలేషన్ విషయంలో సమాధానం దొరకాల్సిన ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి.

కాగా ఒక సందర్భంలో రష్మీ-సుధీర్ రిలేషన్ బయటపెట్టేలా యాంకర్ వర్షిణి ఒక కామెంట్ చేసింది. ఢీ 10 ఎపిసోడ్లో రష్మీ గౌతమ్ తోటి యాంకర్ వర్షిణికి ఒక టాస్క్ ఇచ్చింది. సుధీర్ తనకు మసాజ్ చేసినట్లు మరొకరికి నువ్వు మసాజ్ చేయాలని చెప్పింది. దానికి వర్షిణి… ‘నాకెలా తెలుస్తుంది మీరెలా మసాజ్ చేసుకుంటారో’ అని చెప్పింది. ఆమె టైమింగ్ కి రష్మీ, సుధీర్ షాక్ అవగా, వేదికపై ఉన్న వాళ్ళందరూ పగలబడి నవ్వారు. వర్షిణి ఆ కామెంట్ చేయడం వెనుక బలమైన కారణం ఉందా? వారిద్దరి ఎఫైర్ గురించి తెలిసే అలా అన్నారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. అప్పటి వీడియో వైరల్ గా మారింది.