
Anasuya Bharadwaj: అనసూయ అందానికి సోషల్ మీడియా సలాం అంటుంది. మేడం మీరు బ్యూటిఫుల్ అంటూ ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తాజాగా స్లీవ్ లెస్ జాకెట్, శారీ ధరించి మెస్మరైజింగ్ ఫోటో షూట్ చేసింది. ట్రెడిషనల్ వేర్లో చందమామలా తోచింది. అనసూయ గ్లామర్ చూసిన జనాలు ఆమె అన్నం తింటుందా అమృతం తగ్గుతుందా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నాలుగు పదుల వయసు దగ్గరవుతున్న అనసూయ ఈ రేంజ్ గ్లామర్ మైంటైన్ చేయడం గొప్ప విశేషం.
అనసూయ చిన్న వయసులోనే వివాహం చేసుకున్నారు. సుశాంక్ భరద్వాజ్ ని ప్రేమ వివాహం చేసుకున్నారు. స్కూల్ డేస్ లో మొదలైన ఎఫైర్ ఏళ్ల తరబడి సాగి పెళ్లికి దారి తీసింది. కెరీర్లో ఎదగక మునుపే అనసూయకు పెళ్ళై ఇద్దరు పిల్లలు పుట్టారు. యంగ్ లుక్ మైంటైన్ చేస్తున్నప్పటికీ.. ఈ కారణంతో అనసూయను ఆంటీ అంటూ ట్రోల్ చేస్తుంటారు.

ఆంటీ అంటే తనకు ఎందుకు కోపం వస్తుందో ఇటీవల అనసూయ వెల్లడించారు. ఆంటీ అనే వారి కామెంట్ వెనుక వేరే అర్థం ఉంటుంది. అందుకే నాకు నచ్చదు. కానీ ఈ మధ్య కోపం రావడం లేదు. వాళ్ళ ఖర్మ అని వదిలేస్తున్నాను. ఇలాంటి వాళ్లను పట్టించుకోవడం కంటే జీవితంలో ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయని అనసూయ అన్నారు. అదే సమయంలో అతిగా ట్రోల్ చేస్తే ఊరుకోదు. నేరుగా సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేస్తుంది.
కాగా అనసూయ యాంకరింగ్ మానేశారు. ఇది ఒకింత అభిమానులను నిరాశ పరిచే అంశం. ఇకపై బుల్లితెర మీద కనిపించేది లేదని కూడా హింట్ ఇచ్చారు. టీఆర్పీ కోసం మేకర్స్ ఛీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. అవి నాకు నచ్చడం లేదు. అందుకే యాంకరింగ్ కి దూరమయ్యానని స్పష్టత ఇచ్చారు. తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ మీద కూడా అనసూయ ఆరోపణలు చేశారు. కమెడియన్స్ బాడీ షేమింగ్ కి గురిచేశారని వాపోయారు.

ఇటీవల అనసూయ రంగమార్తాండ మూవీతో అలరించారు. ప్రధాన పాత్రల్లో ఒకటైన ప్రకాష్ రాజ్ కోడలిగా ఆమె నటించి మెప్పించారు. ప్రస్తుతం పుష్ప 2 చిత్రంలో అనసూయ నటిస్తున్నారు. త్వరలో కొత్త ప్రాజెక్ట్ ప్రకటించనున్నట్లు వెల్లడించారు. నటిగా అనసూయ కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది.